ఓపెన్ యూనివర్సిటీలో కోయ, గోండు విద్యార్థులకు ఉచిత విద్య
ABN , Publish Date - Jun 30 , 2026 | 11:10 PM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాల యం ద్వారా ఆదివాసిలైన గోండులు, కోయ, చెంచు, కొలాం వంటి ట్రైబల్స్‌కు ఉచితంగా వి ద్యను అందిస్తామని యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
యూనివర్సిటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు
గద్వాల టౌన్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాల యం ద్వారా ఆదివాసిలైన గోండులు, కోయ, చెంచు, కొలాం వంటి ట్రైబల్స్‌కు ఉచితంగా వి ద్యను అందిస్తామని యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థులకు నైపు ణ్య శిక్షణనివ్వడం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని స్వామి రామానందతీర్థ రూరల్ ఇనిస్టిట్యూట్ సంస్థ చైర్మన్ ఎన్.కిశోర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను, ఓపెన్ డిగ్రీ అధ్యయన కేంద్రాన్ని ప్రముఖ తెలుగు కవి, రచయిత, విమర్శకుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్‌తో కలిసి వెంకటేశ్వర్లు, కిశోర్‌రెడ్డి సందర్శించారు. ఈసందర్భంగా మాట్లాడిన ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ కలందర్ బాషా, స్థానిక అధ్యయన కేంద్రం ద్వారా బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీలో అడ్మి షన్లు ప్రారంభమయ్యాయని, జూలై 7వ తేదీ వరకు అడ్మిషన్లు ఉంటాయన్నారు. కళాశాలను సందర్శించిన ఉన్నతాధికారులను ప్రిన్సిపాల్, అ ధ్యాపకులు ఘనంగా సన్మానించారు. కార్యక్ర మంలో వైస్‌ప్రిన్సిపాల్ చంద్రమోహన్, స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ వెంకటేశ్వరమ్మ, దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ సత్యన్న, హరినాగ భూషణం, అధ్యాపకులు ఉన్నారు.