Share News

అలంపూర్‌లో రూ.135 కోట్ల పనులకు శంకుస్థాపన

ABN , Publish Date - Nov 27 , 2026 | 11:35 PM

అలంపూర్‌ నియోజకవర్గంలో రూ.135 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు శుక్రవా రం రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శా ఖల మంత్రి అనసూయ (సీతక్క), పశుసంవర్ధ క శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపనలు చేశారు.

అలంపూర్‌లో రూ.135 కోట్ల పనులకు శంకుస్థాపన
కంచుపాడులో బీటీరోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే విజయుడు, ఎంపీ మల్లురవి, కలెక్టర్‌

  • రాష్ట్ర పంచాయతీరాజ్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ మంతి సీతక్క , పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

గద్వాల/ఉండవల్లి/ వడ్డేపల్లి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): అలంపూర్‌ నియోజకవర్గంలో రూ.135 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు శుక్రవా రం రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శా ఖల మంత్రి అనసూయ (సీతక్క), పశుసంవర్ధ క శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపనలు చేశారు. ఉండవెల్లి మండలం కంచుపాడు గ్రా మంలో సురవరం వెంకట్రామిరెడ్డి విజ్ఞాన కేం ద్రాన్ని సందర్శించారు. సురవరం సుధాకర్‌రెడ్డి గ్రంథాలయం, క్రీడా నైపుణ్యాభివృద్ధి శిక్షణ విభాగాలను పరిశీలించి కార్యక్రమాలను తెలుసుకున్నారు. అదే గ్రామంలో రూ.3కోట్లతో నిర్మించే బీ టీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. వీబీ జీరాంజీ పథకంలో రూ. 30.22 కోట్లతో చేపట్టే 323 సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అయిజ రహదారిలో రూ.3.56 కోట్లతో చేపట్టే సీటీపాడ్‌ రోడ్డు పనులకు, రూ.2.50 కోట్లతో చేప ట్టే సోంపురం, సీటి పాడు పీడబ్ల్యూడీ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. రాజోలి మండ లం పచ్చర్గ గ్రామం నుంచి పెద్దతాండ్రపాడు గ్రామం వరకు రూ. 5 కోట్లతో చేపట్టే బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా అయిజలో చేయూత పింఛన్లు, ఇందిరమ్మ చీర లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా సీత క్క మాట్లాడుతూ గద్వాల జిల్లాలో మహిళా సం ఘాలకు రూ.212 కోట్ల వడ్డీలేని రుణాలను అందించినట్లు తెలిపారు. మహిళా సంఘాలకు ప్రతీ గ్రామంలో సమావేశాల నిర్వహణ కోసం భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. బస్సు లు, సోలార్‌ ప్లాంట్లు, పెట్రోల్‌ బంక్‌లతో పాటు జీవనోపాధికి పెద్ద మొత్తంలో అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లాలో కొత్తగా 9 వేల చేయూత పింఛన్లు మంజూరు చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ డాక్టర్‌ మల్లు రవి, ఎమ్మెల్యే విజయుడు, కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌, అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌, మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్‌పర్సన్‌ సరిత, వాల్మీకి బోయ కార్పొరేషన్‌ చైర్మన్‌ గట్టు తిమ్మప్ప, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ శ్రీనివాసులు డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి పాల్గొన్నారు.

పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ

అలంపూర్‌, (ఆంధ్రజ్యోతి): మండలంలోని బైరాన్‌పల్లికి చెందిన 32 మంది లబ్ధిదారులకు 30ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థలాల ప ట్టాల సమస్యను పరిష్కరించారు. ఎంపీ మ ల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ సహ కారంతో మంజూరు కావడంతో లబ్ధిదారులు హ ర్షం వ్యక్తంచేశారు. శుక్రవారం అమ్మవారి దర్శనా నికి వచ్చిన మంత్రి సీతక్క చేతుల మీదుగా స ర్పంచు స్వాతి విక్రంనాయుడు ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల పట్టాలను హరిత టూరిజం హోటల్‌ వ ద్ద పంపిణీ చేశారు. ఈసందర్భంగా లబ్ధిదారులు సంపత్‌కుమార్‌ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు అ డ్డాకుల రాము,రైతు సంఘం సొసైటీ సభ్యుడు వెంకటేశ్వర్లు నాయుడు, నాయకులు పకీరయ్య, రాముడు,విశ్వనాథం, రఘుపతినాయుడు, సర్పం చులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2026 | 11:35 PM