Share News

సకాలంలో ఫారాలు అందజేయాలి

ABN , Publish Date - Jul 13 , 2026 | 11:29 PM

ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన ఎన్యుమరేషన్‌ ఫారాల్లో ఓటరుకు సంబంధించిన పూర్తి వివరాలు రాసి సకాలంలో సంబంధిత బీఎల్‌వోకు అందజేయాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు టీకే నర్సింహులు కోరారు.

 సకాలంలో ఫారాలు అందజేయాలి
బస్వాయిపల్లిలో ఎన్యుమరేషన్‌ ఫారం భర్తీ చేస్తున్న బీఎల్‌వోలు

మూసాపేట, జూలై 13 (ఆంధ్రజ్యోతి) : ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన ఎన్యుమరేషన్‌ ఫారాల్లో ఓటరుకు సంబంధించిన పూర్తి వివరాలు రాసి సకాలంలో సంబంధిత బీఎల్‌వోకు అందజేయాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు టీకే నర్సింహులు కోరారు. సోమవారం మండలంలోని వేములలో ఎస్‌ఐఆర్‌ సర్వేను బీజేపీ నాయకులతో కలిసి పర్యవేక్షించారు. నాయకులు కొండారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, విష్ణు, తిరుపతయ్య యాదవ్‌, బాలచందర్‌, భీమన్నయాదవ్‌, గణేష్‌నాయుడు, బీఎల్‌వోలు అనురాధ, లక్ష్మి, రజియాబేగం పాల్గొన్నారు.

మిడ్జిల్‌ : ఎస్‌ఐఆర్‌ ఓటరు మ్యాపింగ్‌ను విజయవంతం చేయడంతో ఓటరు భాగస్వామి కావాలని కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి అమరేందర్‌రెడ్డి కోరారు. మిడ్జిల్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో ఎస్‌ఐఆర్‌ ఎన్యుమరేషన్‌ ప్రక్రియను పరిశీలించారు.

దేవరకద్ర ఎస్‌ఐఆర్‌కు ప్రతీ ఒక్కరు సహకరించాలని తహసీల్దార్‌ మహమ్మద్‌ ఆర్షద్‌ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో బీఎల్‌వోలతో కలిసి ఎన్యుమరేషన్‌ ఫారాలు అందజేశారు.

మహబూబ్‌నగర్‌ టౌన్‌ : ఎన్యుమరేషన్‌ ఫారాలు సకాలంలో అందజేయాలని శ్రీనివాసకాలని 21వ డివిజన్‌ కార్పొరేటర్‌ గుండా సంతోష్‌ పేర్కొన్నారు. కమ్యూనిటీ హాల్‌లో ఎన్యుమరేషన్‌ ప్రక్రియను పర్యవేక్షించారు. బీఎల్‌వోలు చిన్నికృష్ణ, మాధవి, రాజేశ్వరి, శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2026 | 11:30 PM