Share News

వర్షం కోసం..

ABN , Publish Date - Oct 04 , 2026 | 11:29 PM

వర్షాలు లేక భూగర్భ జ లాలు అడుగంటి పోతుండటంతో రైతు లు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటు న్న నేపథ్యంలో సమృద్ధిగా వర్షాలు కు రువాలని ఆకాంక్షిస్తూ మహబూబ్‌నగర్‌ లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థన లు నిర్వహించారు.

 వర్షం కోసం..
మహబూబ్‌నగర్‌లోని హీరా మోడల్‌ హైస్కూల్‌ మైదానంలో వర్షాల కోసం ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు

- హీరా మోడల్‌ స్కూల్‌ మైదానంలో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు

మహబూబ్‌నగర్‌ అర్బన్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): వర్షాలు లేక భూగర్భ జ లాలు అడుగంటి పోతుండటంతో రైతు లు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటు న్న నేపథ్యంలో సమృద్ధిగా వర్షాలు కు రువాలని ఆకాంక్షిస్తూ మహబూబ్‌నగర్‌ లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థన లు నిర్వహించారు. నగరంలోని భూ త్పూర్‌ రోడ్డులోని హీరా మోడల్‌ స్కూల్‌ మైదానంలో ఆదివారం పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరై నమాజ్‌-ఎ- ఇస్తిస్కా నిర్వహించారు. ఈ సందర్భం గా ప్రముఖ ధార్మిక వేత్త అల్లామా మౌ లానా అహ్మద్‌ సాదత్‌అలీ షా చిస్తీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధి గా వర్షాలు కురవాలని మహబూబ్‌ నగ ర్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు తెలిపారు. అర్హత ఉన్నవారు జకాత్‌ చెల్లించాల ని, పేదలు, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. షాషాబ్‌గుట్ట దర్గా ఫీఠాధిపతి అబ్దుల్‌ రజాక్‌ షా ఖాద్రీ, మునీరుద్దీన్‌, మహ్మ ద్‌ నయామత్‌ఖాన్‌, ఖాలీద్‌నవీద్‌, మ హ్మద్‌ ఫైసల్‌, మీర్‌షోయాబ్‌అలీ తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2026 | 11:29 PM