Share News

పశుగ్రాస ఉత్పత్తి అత్యంత కీలకం

ABN , Publish Date - Jul 14 , 2026 | 11:25 PM

పశుసంప ద అభివృద్ధికి పశుగ్రాస ఉత్ఫత్తి అత్యంత కీలక మని జిల్లా పశువైద్యాధికారి శివానందస్వామి పేర్కొన్నారు.

పశుగ్రాస ఉత్పత్తి అత్యంత కీలకం
మేలుజాతి పశుగ్రాసం గురించి వివరిస్తున్న జిల్లా పశువైద్యాధికారి శివానందస్వామి

జడ్చర్ల, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : పశుసంప ద అభివృద్ధికి పశుగ్రాస ఉత్ఫత్తి అత్యంత కీలక మని జిల్లా పశువైద్యాధికారి శివానందస్వామి పేర్కొన్నారు. మండలంలోని తంగెళ్లపల్లిలో మం గళవారం పశుగ్రాస వారోత్సవాల ముగింపు కా ర్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు. అధిక దిగు బడి ఇచ్చే 4జీ బుల్లెట్‌ నాపియర్‌ వంటి మేలు జాతి పశుగ్రాసం సాగు చేస్తే సంవత్సరం అం తా పచ్చిమేత అందుబాటులో ఉంటుందన్నారు. పొలాలు గట్ల వద్ద సుబాబుల్‌ చెట్లను పెంచా లన్నారు. జొన్న పశుగ్రాసాన్ని పొట్టదశలో పశు వులకు తినిపించాలని, పాల ఉత్పత్తి పెరుగు తుందన్నారు. గొర్రెలలో అత్యంత ప్రమాదకర మైన పీపీఆర్‌ (పెస్టెడెస్‌ పెటిట్స్‌ ర్యూమినట్స్‌ వ్యాధి నివారణకు టీకాలు వేశారు. అనంతరం పాడి రైతులకు సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు పంపిణీ చేశారు. జడ్చర్ల మండల పశువైద్యాధి కారులు ఆశారాణి, శ్రావణి, జిల్లా వ్యాధి నిర్దార ణ ప్రయోగశాల పశువైద్యాధికారి కరుణశ్రీ, డాక్టర్‌ సుప్రియ పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 11:25 PM