అభివృద్ధి, సమస్యలపైనే దృష్టి
ABN , Publish Date - Sep 26 , 2026 | 11:32 PM
రాష్ట్రం ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
- పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి
మహమ్మదాబాద్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రం ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని నంచర్ల గ్రామం నుంచి చౌదర్‌పల్లి వరకు రూ.2 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు పూర్తి కావడంతో దాన్ని ప్రజలకు అంకితం చేశారు. అనంతరం మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల సమావేశ మందిరం లో అధికారులు, ప్రజాప్రతినిఽధులతో నిర్వహించి న సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు అవసరమైన సంక్షేమ పథ కాలు అందజేస్తున్నామని, వాటిని అక్హులకు అం దించాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు. పేద లకు ఇందిరమ్మ ఇళ్లతో లబ్ధి చేకూరుతుందన్నా రు. అంతకుముందు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో నెలకొన్న మంచినీటి సమస్య, పారిశుధ్యంపై అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మహమ్మదాబాద్, నంచర్ల సర్పంచులు రాంలాల్, సుంకిరెడ్డి గాయత్రి, మం డల అధ్యక్షుడులు కేఎం నారాయణ, అనంతల క్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ శాంతిరంగ్యా, ఎమ్మార్వో విద్యాసాగర్‌రెడ్డి, ఎంపీడీవో నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. మొకర్లాబాద్ రైతు వేదికలో స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. అంతకుముందు మీసేవ ను ప్రారంభించారు. నంచర్ల, శేఖ్‌పల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇంటి ప్రవేశాల్లో పాల్గొన్నారు.