తాగునీటి వనరులపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Oct 23 , 2026 | 11:39 PM
ఎల్‌నినో ప్రభావాన్ని అందరం సమష్టిగా ఎదుర్కొనేందు కు సిద్ధం కావాలని అదనపు కలెక్టర్ బి.నర్సింగరావు సర్పంచ్‌లకు సూచించారు.
గట్టు సర్వసభ్య సమావేశంలో అదనపు కలెక్టర్ బి.నర్సింగరావు
గట్టు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావాన్ని అందరం సమష్టిగా ఎదుర్కొనేందు కు సిద్ధం కావాలని అదనపు కలెక్టర్ బి.నర్సింగరావు సర్పంచ్‌లకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని మహిళాసమాఖ్య భవనం లో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించా రు. ముఖ్యఅతిథిగా అదనపు హాజరై మాట్లాడా రు. ఎల్‌నినో నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి వనరులను రక్షించుకోవాలని చెప్పారు. దీనివల్ల రానున్న రోజుల్లో విద్యుత్ సమస్య తలెత్తే అవ కాశం ఉందన్నారు. వీబీజీ రాంజీ పథకాన్ని సర్పంచులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పా రు. ప్రతీ గ్రామంలో వందమందికి పైగా కూలీ లు వీబీ జీరాంజీ పనులకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ 40మంది కూలీలకు ఒక మేట్‌ను నియామకం చేస్తున్నామని, కూలీలతో పాటు మేట్‌కు కూలీ వస్తుందన్నారు. పనులు పుష్కలంగా ఉన్నాయని, ప్రతీ రైతు జలసిరిలో ఒక పంటకుంట నిర్మించాలని, ఇంకుడుగుంతలు తవ్వించడానికి సర్పంచులు చొరవ తీసుకోవాలని చెప్పారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చే యించుకోవాలని చెప్పారు. సమావేశంలో మం డల ప్రత్యేకాధికారి అక్బర్‌బాషా, మండల అభి వృద్ధి అధికారి అబ్దుల్ సయ్యద్‌ఖాన్, విద్యాధికారి వెంకటేశ్వర్లు, నయాబ్ తహసీల్దార్ కరుణాకర్, మిషన్ భగీరథ ఏఈ కృష్ణచైతన్య, ఏపీవో స్వామి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, పంచాయ తీ కార్యదర్శులు పాల్గొన్నారు.