Share News

అత్యవసర సేవల సామర్థ్యంపై దృష్టి

ABN , Publish Date - Jul 25 , 2026 | 11:05 PM

జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని పలువిభాగాలను ఎస్పీ శ్రీనివాసరావు శనివారం ప్రత్యేకంగా తనిఖీ చేశారు.

అత్యవసర సేవల సామర్థ్యంపై దృష్టి

  • జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో విభాగాలను తనిఖీ చేసిన ఎస్పీ

గద్వాలక్రైం, జూలై 25 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని పలువిభాగాలను ఎస్పీ శ్రీనివాసరావు శనివారం ప్రత్యేకంగా తనిఖీ చేశారు. ఆర్‌ఐ స్టోర్‌, బాంబ్‌ డిస్పోజల్‌ టీం, ఆర్‌ఐ వెల్ఫే ర్‌ కార్యాలయం, ఏఆర్‌ డీఎస్పీ కార్యాలయం, మోటార్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌ సెక్ష న్‌, హోంగార్డ్‌ కార్యాలయం, జిల్లా కంట్రోల్‌ రూమ్‌, కమాండ్‌ కంట్రోల్‌ సెం టర్‌ తదితర విభాగాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ డయల్‌ 100, పెట్రోకార్లు, నైట్‌ పెట్రోలింగ్‌, హైవే పెట్రోలింగ్‌, బ్లూకో ట్‌, బీట్‌ సిబ్బంది కార్యకలాపాలను కంట్రోల్‌ రూమ్‌ ద్వారా పర్యవేక్షి స్తూ అవసరమైన సమయంలో సమన్వయం చేయాలని సూచించారు. ప్ర జల నుంచి వచ్చే అత్యవసర ఫిర్యాదులపై వెంటనే స్పందించి, బాధితులకు సత్వరం పోలీసు సేవలు అందించడం మన బాధ్యత అని చెప్పారు. క మాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రత్యక్ష దృశ్యాలను పరిశీలించి, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అనుమానాస్పద కదలికలను వెంటనే గుర్తించి సంబంధిత పోలీసు అధికారులకు సమాచా రం తెలుపాలని చెప్పారు. ఎస్‌-మాక్‌ రూమ్‌ ద్వారా సాంకేతిక సమాచారా న్ని సమర్థవంతంగా వినియోగిస్తూ నేరాల నియంత్రణ, ఇంటలిజెన్స్‌ సేకర ణ, నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ఆఽధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా ప్రజలకు మరింత వేగవంతమైన, సమర్థవంతమైన పోలీసు సేవలు అందించడం సాధ్యమౌతుందన్నారు. మోటర్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌ సెక్షన్‌ను తనిఖీ చేసి అన్ని పోలీసు వాహనాల నిర్వహణ, ఇంధన వినియోగ రికార్డులు, లాగ్‌బుక్‌లు, మరమ్మతు వివరాలను పరిశీలించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Jul 25 , 2026 | 11:05 PM