వైభవంగా తెప్పోత్సవం
ABN , Publish Date - Oct 21 , 2026 | 11:41 PM
శ్రీ జోగుళాంబ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు మంగళవారం విజయదశమి సంద ర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలను శాస్త్రోక్తం గా నిర్వహించారు.
- శరన్నవరాత్రి ఉత్సవాలకు శాస్త్రోక్తంగా ముగింపు
- మహా పూర్ణాహుతి, త్రిశూల స్నానంతో ముగిసిన పూజా కార్యక్రమాలు
అలంపూర్, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): శ్రీ జోగుళాంబ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు మంగళవారం విజయదశమి సంద ర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలను శాస్త్రోక్తం గా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా యాగశా లలో మహాపూర్ణాహుతి, కళశాల ఉద్వాసన అమ్మ వారి మూల మూర్తికి ప్రత్యేక పూజలు వైభవం గా నిర్వహించారు. యాగశాలలో ఉత్సవాల మొ దటి రోజున ప్రతిష్టించిన కళశాలకు, వివిధ మం డపాలకు మండపరాధన, నిత్య పూజలు పూర్తి చేశారు. అనంతరం మహా పూర్ణాహుతితో యాగ శాలలో ఉద్వాసన పలికి, వాటిలోని పవిత్ర జలాలతో జోగుళాంబ అమ్మవారి మూలమూర్తి వేద మం త్రోక్తంగా మార్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. తదుపరి అమ్మ వారి కి విశేష సమర్పణ చేశారు. అనంతరం జోగుళాంబ అమ్మవారి ఉత్స వమూర్తి బలిమేరమైన త్రిశూలాన్ని పల్లకీసేవ ద్వారా నాగకన్యల భావి వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక అర్పణలు చేశారు. కళశాలలోని ప్రవిత్ర జలాలతో అవబృత స్నపనం, త్రిశూల స్నానం జరిపించి మహా నివేదనను సమర్పించారు.
తుంగ భద్ర నదిలో ఆది దంపతుల హంస వాహన విహారం
జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం వద్ద ఆధ్యాత్మిక సందడి నెలకొంది. జోగుళాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామివార్ల హంసవాహన తెప్సోత్సవం, నదీహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే విజయుడు, డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి, డీఎస్పీ మొగులయ్య శమీ పూజ నిర్వహించి స్వామి అమ్మవార్లను పల్లకీలో నదీతీరం వద్దకు తీసుకు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు భ క్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ పిండి జయరాములు, వైస్ చైర్మన్ విక్రం, సీఐ ప్రదీప్ కుమార్, పోలీసు బృందం తదితరులు పాల్గొన్నారు.