బాత్‌రూంలో ఐదడుగుల నాగుపాము
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:14 PM
వనపర్తి పట్టణ కేంద్రంలోని టీచర్స్ కాలనీలో ఓ ఇంట్లో బాత్‌రూమ్‌లో ఆదివారం ఐదు అడుగుల నాగుపాము కలవరం సృష్టిం చింది.
- భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు
వనపర్తి రూరల్, మార్చి 15 (ఆంధ్ర జ్యోతి) : వనపర్తి పట్టణ కేంద్రంలోని టీచర్స్ కాలనీలో ఓ ఇంట్లో బాత్‌రూమ్‌లో ఆదివారం ఐదు అడుగుల నాగుపాము కలవరం సృష్టిం చింది. పట్టణ కేంద్రంలోని టీచర్స్ కాలనీలో సఖి సెంటర్ పని చేస్తున్న మంజుల ఇంటి బాత్‌రూంలో గత ఐదు రోజుల కింద నా గుపాము కన్పించడంతో స్నేక్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు కృష్ణసాగర్‌కు సమాచారమందిం చారు. స్పందించిన ఆయన ఘటన స్థలానికి చేరుకుని పామును పట్టేందుకు శతవిధా లుగా ప్రయత్నించిన పాము బాత్‌రూమ్ పైపులో నుంచి బయటకి రాకపోవడంతో వెనుతిరిగిపోయాడు. పాము మళ్లీ పక్కనే ఉన్న మంజుల అత్తగారింట్లో కన్పించింది. విషయం తెలుసుకున్న కృష్ణసాగర్ ఘటన స్థలానికి చేరుకుని పామును పట్టుకుని బంధించాడు. ఫ గత వారం రోజులుగా పాము ఎక్కడ ఉందోనని భయంతో బిక్కుబిక్కుమంటూ కు టుంబ సభ్యులు పామును బంధించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణ సాగర్ మాట్లాడుతూ నాగుపాము ఐదు అ డుగుల పొడవు ఉంటుందని, ఇంత పొడవైన పాము ఇంట్లోకి రావడం ఇదే మొదటిసారి అని తెలిపారు. ఇంటి పరిసర ప్రాంతాలు శు భ్రంగా ఉంటే ఎలాంటి విష సర్పాలు ఇం ట్లోకి రావని కాలనీవాసులకు వివరించారు. పట్టుకున్న పామును ఫారెస్టు ప్రాంతంలో వదిలేస్తున్నట్లు తెలిపారు.