రూ. 2లక్షల బాణసంచా సీజ్
ABN , Publish Date - Nov 05 , 2026 | 11:19 PM
ఎ లాంటి అనుమతులు లేకుండా దీపావళి బా ణసంచా విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేసి, వారి వద్ద రూ. 2.10 లక్షల విలువ గల సామగ్రిని జడ్చర్ల పోలీ సులు సీజ్ చేశారు.
- నలుగురు వ్యక్తులపై కేసు నమోదు
జడ్చర్ల, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఎ లాంటి అనుమతులు లేకుండా దీపావళి బా ణసంచా విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేసి, వారి వద్ద రూ. 2.10 లక్షల విలువ గల సామగ్రిని జడ్చర్ల పోలీ సులు సీజ్ చేశారు. జడ్చర్ల సీఐ కమలాకర్ గురువారం వెల్లడించిన వివరాల మేరకు... మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని పోలేపల్లి సెజ్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తున్నారన్న స మాచారం మేరకు ఆకస్మిక తనిఖీ లు చేసినట్లు తెలిపారు. హైదరా బాద్‌కు చెందిన నీరడి రవీందర్, కడప జిల్లా కాజీపేటకు చెందిన ఉదయగిరి సద్దాం, జడ్చర్ల పట్టణానికి చెందిన సాయిదీ ప్, రాజులు బాణసంచా విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. వీరి వద్ద ఉన్న వివిధ కంపెనీ లకు చెందిన రూ. 2,10,200 విలువగల బా ణసంచాను సీజ్ చేశారు. వాటిని జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.