పీర్ల రోజు చిచ్చు
ABN , Publish Date - Jun 28 , 2026 | 11:38 PM
మహ బూబ్‌నగర్ జిల్లా, మిడ్జిల్ మండలంలోని మ సిగుండ్లపల్లి గ్రామంలో పీర్ల పండుగ సంద ర్భంగా జరిగిన చిన్న వాగ్వాదం అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ కు దారితీసింది.
- మసిగుండ్ల పల్లిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
- పోలీసులపైనా దాడి.. కానిస్టేబుల్‌కు గాయాలు
- ఆదివారం ఇరువర్గాల మధ్య మళ్లీ దాడులు
- ఎస్పీ కార్యాలయానికి కీలక నాయకుల తరలింపు
మిడ్జిల్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : మహ బూబ్‌నగర్ జిల్లా, మిడ్జిల్ మండలంలోని మ సిగుండ్లపల్లి గ్రామంలో పీర్ల పండుగ సంద ర్భంగా జరిగిన చిన్న వాగ్వాదం అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ కు దారితీసింది. ఆదివారం మరోసారి ఇరువ ర్గాలకు చెందిన వారు ఒకరిపై మరొకరు దా డులకు పాల్పడ్డారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వా తావరణం నెలకొన్నది. గ్రామంలో ఇప్పటికే నెలకొన్న రాజకీయ విభేదాలు ఈ ఘటనతో మరింత ముదిరాయి. శుక్రవారం పీర్ల పం డుగ సందర్భంగా నిర్వహించిన అలావ్ కార్య క్రమంలో దొడల శ్రీకాంత్ అనే వ్యక్తి కట్టెతో నిప్పును కొట్టగా, అదే సమయంలో బూరమో ని తిరుపతి కూడా మరో కట్టెతో నిప్పులను కొట్టాడు. ఈ క్రమంలో శ్రీకాంత్ పదే పదే ని ప్పులను కొట్టడంతో అలా ఎందుకు చేస్తున్నా వంటూ తిరుపతి అతడిని ప్రశ్నించాడు. దీం తో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్ష ణకు దారితీసింది. అనంతరం శ్రీకాంత్ వర్గీయులు తిరుపతిని పక్కకు తీసుకెళ్లడంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఈ దాడుల్లో పలువురికి గాయాల య్యాయి. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న పోలీ సులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదర గొట్టేందుకు యత్నించారు. కానీ పరిస్థితి అ దుపు తప్పి కొందరు పోలీసులపైనే దాడి చే శారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ జగదీష్ తలకు గాయాలయ్యాయి. వెంటనే ఆయనకు చికిత్స నిమిత్తం అస్పత్రికి తరలించినట్లు తెలి పారు. అనంతరం ఇరువర్గాలకు చెందిన వారు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కానీ వివాదం అక్కడితో ము గియలేదు. ఆదివారం ఉదయం పాలు పితు కుని ఇంటికి వెళ్తున్న బూరమోని శివశంకర్, పీర్ల పండుగ రోజు గాయపడిన ఆగమోని శివ కుటుంబ సభ్యుల మధ్య మళ్లీ గొడవ జ రిగింది. ఇరువర్గాలు మరోసారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నారు. గ్రామస్థుల క థనం ప్రకారం... గతంలో ఇరువర్గాలు ఎంతో స్నే హంగా ఉండేవారని, అయితే గ్రామపం చాయతీ ఎన్నికల్లో ఎన్నికల్లో అధికార పార్టీ మద్దతుతో కావలి చెన్నయ్య, గోదా శ్రీశైలం పోటీ చేయగా, శ్రీశైలం విజయం సాధించా రు. తర్వాత ఇరువర్గాల మధ్య రాజకీయ వి భేదాలు తలెత్తి తరుచూ ఘర్షణలకు దిగుతు న్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లలో భాగంగా ఆదివారం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన డీఎస్పీ వెంకటేశ్వర్లు ఎదుట ఇరువర్గాల వారు తమ వాదనను వినిపించుకున్నారు. విషయం తె లుసుకున్న అధికార పార్టీ నియోజకవర్గ, మండల నాయకులు సీఎం పర్యటన అనంత రం కూర్చొని సమస్యను పరిష్కరించుకుందా మని ఇరువర్గాలకు నచ్చ చెప్పినట్లు తెలిసిం ది. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఇరువర్లాకు చెందిన కీలక వ్యక్తుల ను ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఆదివారం రాత్రి డీఎస్పీ వెంకటేశ్వర్లు, జడ్చర్ల సీఐ కమలాకర్, ఎస్‌ఐ శ్రీనివాసులు ప్రత్యేక పోలీసు బలగాలతో గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.