Share News

నిప్పుల కుంపటి

ABN , Publish Date - May 21 , 2026 | 11:54 PM

మం డే ఎండలను తట్టుకోలేక పోతున్నాం.. కొంచెం కొంచెం తగ్గరాదయ్యా సూరీడూ.. అని జనం వేడుకుంటున్నా రు.

నిప్పుల కుంపటి
మహబూబ్‌నగర్‌ పట్టణంలో గొడుగు నీడన పండ్లు విక్రయిస్తున్న మహిళలు

- పాలమూరులో 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత

- లింగాల మండలంలో 41.9 డిగ్రీలుగా నమోదు

- ఉక్కపోతకు తట్టుకోలేకపోతున్న జనం

- వడదెబ్బతో ఇద్దరి మృతి

మహబూబ్‌నగర్‌/ నారాయణపేట/ నాగర్‌కర్నూల్‌ టౌన్‌/ గద్వాల/ వనపర్తి, మే 21 (ఆంధ్రజ్యోతి) : మం డే ఎండలను తట్టుకోలేక పోతున్నాం.. కొంచెం కొంచెం తగ్గరాదయ్యా సూరీడూ.. అని జనం వేడుకుంటున్నా రు. భానుడి భగభగల నుంచి తప్పించుకునేందుకు నా నా పాట్లు పడుతున్నారు. బయటకు వెళ్తే ఎండ.. ఇంట్లో ఉంటే ఉక్కపోతతో జనం అ ల్లాడిపోతున్నారు. పొద్దస్తమానం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు నడవకపోతే ఇంట్లో ఉండలే కపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. తప్పనిసరి పనులపై బయటకు వెళ్లాల్సి వస్తే మహిళలు, యువతులు తలపై చున్నీలు, కొంగులు, పురుషులు, యువకులు, పిల్లలు టోపీలు ధరించక తప్పడం లేదు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే టప్పుడు వేడి గాలితో అల్లాడి పోతున్నామని చెప్తు న్నారు. చిరు వ్యాపారులు మరింత ఇబ్బంది పడుతు న్నారు. గొడుగు నీడన పండ్లు, కూరగాయలు విక్రయిస్తున్నారు. వివిధ పనులపై ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారు.. వాటి ఆవరణలోని చెట్ల నీడన సేద తీరుతున్నారు. శీతల పానీయాల దుకాణాల్లో రద్దీ కనిపించింది. గ్రామాల్లో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, ఉపా ధి కూలీలు, ఉదయం వేళల్లోనే ప నులు ముగించుకుని మధ్యాహ్నం లో పే ఇంటికి చేరుకుంటున్నారు. తగి నంత నీరు, మజ్జిగ, పండ్ల రసాలు తీసు కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గు రువారం పాలమూరు జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.

గండీడ్‌ మండలం వెన్నచేడుకు చెందిన గొర్రెల కాపరి బజార్ల మల్లప్ప(55) వడదెబ్బకు గురై స్పృహ తప్పి పడిపోయాడు. తోటి కాపరులు కోస్గి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెంది నట్లు వైద్యులు నిర్ధారించారు.

- నారాయణపేట జిల్లాలో ఉష్ర్ణోగ్రత గరిష్ఠం 40, కనిష్ఠం 27 డిగ్రీలుగా నమోదైంది. మక్తల్‌లో గ రిష్ఠం 40, కనిష్ఠం 28 డిగ్రీలుగా ఉంది. కోస్గిలో గరి ష్టం 39 డిగ్రీలు, కనిష్ఠం 28 డిగ్రీలుగా నమోదైంది. మద్దూర్‌లో గరిష్ఠం 39, కనిష్ఠం 27 డిగ్రీలుగా ఉంది.

- నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని లింగాల మండలంలో అత్యధికంగా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చారకొండలలో 41.8, తిమ్మాజిపేటలో 41.5, వెల్దండలో 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యా యి. వెల్దండ, వంగూరు, ఊర్కొండ, కల్వకుర్తి, ఉప్పునుంతల మండ లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

- జోగుళాంబ గద్వాల జిల్లా, ఇటిక్యాల మండల కేంద్రానికి చెందిన కొండారెడ్డి(55) వడదెబ్బతో మృతి చెందాడు. ఆయన కొన్ని రోజుల నుంచి ఎండల్లో ఉపాధి హామీ పనులు చేస్తున్నాడు. గురువారం పనికి వెళ్లిన ఆయన కొద్దిసేపటికే సృహతప్పి, మృతి చెందాడు. జిల్లాలోని అలంపూర్‌లో 41.5, ధరూర్‌లో 41.4, గ ట్టులో 41.1, గద్వాలలో 40.8, ఇటిక్యాలలో 40.5, కేటీదొడ్డిలో 40.3, ఉండవెల్లిలో 40.2, అయిజలో 39.8, రాజోలిలో 39.6, ఎర్రవల్లిలో 39.5, వడ్డేపల్లిలో 39.4, మానవపాడులో 39.3, మల్దకల్‌ 38.4 డిగ్రీలుగా నమోదైంది.

- వనపర్తి జిల్లాలో అత్యధికంగా చిన్నంబావి మండలంలో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పానగల్‌, శ్రీరంగాపూర్‌లలో 40.4, మదనాపూర్‌, వీపనగండ్ల, ఘనపూర్‌లలో 40.3, కొత్తకోట, అమరచింతలలో 39.7 డిగ్రీలుగా ఉంది. రేవల్లి, ఏదుల 39.4, పెద్ద మందడి 39.3, గోపాల్‌పేట, పెబ్బే రు 39.2, పానగల్‌, వనపర్తిలో 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Updated Date - May 21 , 2026 | 11:54 PM