Share News

ఫిల్టర్‌ ఇసుక డంపులు నేలమట్టం

ABN , Publish Date - Mar 28 , 2026 | 11:35 PM

మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలంలో చేపడుతున్న ఫిల్టర్‌ ఇసుక దందాపై ‘వాగుల్లో తోడేళ్లు’ అన్న శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో శనివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.

ఫిల్టర్‌ ఇసుక డంపులు నేలమట్టం
బొక్కలోనిపల్లిలో ఇసుక డంపులను జేసీబీతో నేల మట్టం చేసిన అధికారులు

బొక్కలోనిపల్లిలో కృత్రిమ ఇసుక తయారీ స్థావరంపై అధికారుల దాడులు

‘ఆంధ్రజ్యోతి’ కథనంపై కదలిక

మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలంలో చర్చ

మహబూబ్‌నగర్‌ రూరల్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలంలో చేపడుతున్న ఫిల్టర్‌ ఇసుక దందాపై ‘వాగుల్లో తోడేళ్లు’ అన్న శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో శనివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వాగుల్లో మట్టిని తోడి, ఇసుక తయారు చేసి విక్రయిస్తున్నారని, ఆ ఇసుకతో చేపడుతున్న నిర్మాణాలు దెబ్బతింటున్నాయన్న కథనం రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్‌ఐ విజయ్‌ కుమార్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, సిబ్బంది బొక్కలోనిపల్లి శివారులో ఫిల్టర్‌ ఇసుక స్థావరం వద్దకు వెళ్లారు. ఫిల్టర్‌ ఇసుక డంపులను జేసీబీతో నేలమట్టం చేశారు. కృత్రిమ ఇసుక తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కృత్రిమ ఇసుక తయారీని పూర్తిగా అరికట్టాలని, పేపర్లలో కథనాలు వచ్చినప్పుడే అధికారులు హవావుడి చేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Updated Date - Mar 28 , 2026 | 11:35 PM