హోరాహోరీగా గిరకబండ్ల లాగుడు పోటీలు
ABN , Publish Date - Mar 19 , 2026 | 11:19 PM
ఉగాది పండుగను పురస్కరించుకుని అమర చింత రేసింగ్ బుల్స్ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర స్థాయి మూడు బండ్ల గిరక లాగు పోటీలు హోరాహోరీగా కొనసాగాయి.
అమరచింత, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ఉగాది పండుగను పురస్కరించుకుని అమర చింత రేసింగ్ బుల్స్ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర స్థాయి మూడు బండ్ల గిరక లాగు పోటీలు హోరాహోరీగా కొనసాగాయి. అమరచింత కొత్తబస్టాండ్ సమీప మైదానంలో ఉగాది సం దర్భంగా ఒక్క రోజు జరిగే పోటీలకు మునిసి పల్ చైర్‌పర్సన్ జింక సువర్ణ రవి, వైస్ చైర్మన్ రాధాఅరుణ్ పాల్గొని ప్రారంభించారు. ఈ పోటీల్లో వనపర్తి, నారాయణపేట, గద్వా ల, మహబూబ్‌నగర్ జిల్లాలోని వివిధ ప్రాం తాల నుంచి 18 జతల ఎద్దుల పోటీల్లో పా ల్గొన్నాయి. హోరాహోరీగా సాగిన మూడు బండ్ల గిరక లాగుడు పోటీలను చూడటానికి ఉమ్మడి జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల నుం చి కూడా ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో త రలి వచ్చారు. మొదటి బహుమతి నారాయణపే ట జిల్లా లోకపల్లి చెంది న రాజశేఖర్ ఎద్దులు గె లవగా 20,000 నగదు షీ ల్డ్ ఇవ్వగా, రెండవ బ హుమతి గద్వాల జిల్లాఽ ధరూర్ మండలం మా నాపూర్ గ్రామానికి చెంది న ధర్మారెడ్డి ఆంజనేయులు చెందిన ఎద్దులు గెలవగా 15వేలు నగదు, మూడవ బహుమ తి పొందారు. కేటీదొడ్డి మండలం కంచినేర్ల గ్రామానికి చెందిన శివప్ప గెలవగా పదివేల నగదు, నాల్గవ బహుమతి నారాయణపేట జిల్లా మండలం వడ్డేపేట గ్రామానికి చెందిన గుడిసె రంగప్ప ఎద్దులు గెలవగా రూ.5వేలు నగదు, ఐదవ బహుమతి గద్వాల జిల్లా గం గనపల్లి గ్రామానికి చెందిన ధరప్ప ఎద్దులు గెలవగా 3వేలు నగదు, షీల్డ్ శాలువాతో ము నిసిపల్ చైర్‌పర్సన్ జింక సువర్ణ రవి, వైస్ చైర్మన్ రాధా అరుణ్‌లు సత్కరించి అందించా రు. వెంకటేశ్, రాజశేఖర్, తిరు పతన్న, రమే ష్, భఋామరాజు, శ్రీను పాల్గొన్నారు.