Share News

పండుగలను శాంతియుతంగా చేసుకోవాలి

ABN , Publish Date - May 10 , 2026 | 11:22 PM

రా నున్న బక్రీద్‌ పండుగ సందర్భంగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో మం డలంలోని హిందూ, ముస్లిం మత పెద్దల తో ఎస్‌ఐ అశోక్‌బాబు శాంతి కమిటీ సమా వేశం ఏర్పాటు చేశారు.

పండుగలను శాంతియుతంగా చేసుకోవాలి
ధన్వాడలో మాట్లాడుతున్న సీఐ భగవంత్‌రెడ్డి

మాగనూరు, మే 10 (ఆంధ్రజ్యోతి): రా నున్న బక్రీద్‌ పండుగ సందర్భంగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో మం డలంలోని హిందూ, ముస్లిం మత పెద్దల తో ఎస్‌ఐ అశోక్‌బాబు శాంతి కమిటీ సమా వేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యం దెబ్బ తీసే విధంగా ఎవరూ ప్రవర్తించరాదని, పరస్ప ర గౌరవ భావంతో వ్యవహరించాలని కోరారు. పశువుల అక్రమ రవాణా నివారించేందుకు ఉజ్జెల్లి బార్డర్‌ చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేసినట్లు తెలి పారు. సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. పండుగల సందర్భంగా నిర్వహించే ఊరేగిం పులు, ప్రార్థనలు, ఇతర కార్యక్రమాలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలన్నారు.

శాంతి సమావేశం

ధన్వాడ: బక్రీద్‌ పండుగ నేపథ్యంలో శాంతి భద్రతల రక్షణ, పశువుల అక్రమ రవాణా ని యంత్రణ, శాంతియుతంగా పండుగ జరుపుకోవాలని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో హిందూ, ముస్లిం మత పెద్దలతో మరికల్‌ సీఐ భగవంత్‌రెడ్డి, ఎస్‌ఐ వెంకటేష్‌గౌడ్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పశువుల కొనుగోలు, రవాణా, వధ ప్రక్రియల్లో ప్రభుత్వం నిర్ధేశించిన నిబంధనలు, కోర్టు మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. తనిఖీల సమయంలో పోలీస్‌, వెటర్నరీ, రవాణాశాఖ అధికారులకు సహకరించాలని తెలిపారు.

నారాయణపేట రూరల్‌: పండుగలను శాంతియుతంగా చేసుకోవాలని రూరల్‌ ఎస్‌ఐ సతీష్‌రెడ్డి అన్నారు. బక్రీద్‌ పండుగ సందర్భంగా రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం హిందూ, ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు.

Updated Date - May 10 , 2026 | 11:22 PM