పండుగలు మన సంప్రదాయానికి ప్రతీకలు
ABN , Publish Date - Aug 07 , 2026 | 11:36 PM
ఆబాలగోపాలం ఉత్సాహంగా జరుపుకునే పండు గలు, పర్వదినాలు మన సంస్కృతీ, సంప్రదా యాలకు ప్రతీక అని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రమోహన్ అన్నారు.
పలు విద్యాసంస్థలలో ఉత్సాహంగా బోనాల పండుగ
గద్వాలటౌన్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి) : ఆబాలగోపాలం ఉత్సాహంగా జరుపుకునే పండు గలు, పర్వదినాలు మన సంస్కృతీ, సంప్రదా యాలకు ప్రతీక అని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రమోహన్ అన్నారు. శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో విద్యార్థునులు ఆషాఢమాసం బోనాల పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించిన విద్యార్థినులు బోనాలు తలపై ఎత్తుకుని పండుగకు కొత్తశోభను తెచ్చారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనం సమర్పించారు. ఈ సందర్బంగా విద్యార్థినులు జానపద గీతాలు, బో నాలపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు డప్పులు, నాదంతో కళాశాల ప్రాంగణాన్ని సందడిగా మార్చారు. కళాశాల ఉమెన్ ఎంపవర్‌మెంట్ విభాగంగా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ వెంకటేశ్వరమ్మ, సురేందర్‌రెడ్డి, రాధిక, సత్యమ్మ, పద్మ, రమాదేవి, హరి నాగభూషణం, బోధనేతర సిబ్బంది రమేశ్, విశ్వనాథ్‌రెడ్డి ఉన్నారు.
పాఠశాలల్లో ..
తెలంగాణలో సంప్రదాయబద్ధంగా ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల పండుగను శు క్రవారం పట్టణంలోని పలుపాఠశాలల్లో చిన్నారులు వేడుకగా జరుపుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి, తలపై బోనాలు ఎత్తుకుని వచ్చిన చిన్నారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనం సమర్పించారు. బోనాల పండుగ విశిష్టతను ఉపాధ్యాయులు చిన్నారులకు వివరించారు.