Share News

సుంకాల అమలుతో రైతులకు అన్యాయం

ABN , Publish Date - Jul 20 , 2026 | 11:08 PM

స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం పేరుతో దేశంలోని రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈనెల 22న తలపెట్టిన రైతాంగం నిరసనను విజయ వంతం చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) రాష్ట్ర కన్వీనర్‌ జక్కుల వెంకటయ్య అన్నారు.

సుంకాల అమలుతో రైతులకు అన్యాయం

  • 22న రైతుల నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

  • ఎస్కేఎం రాష్ట్ర కన్వీనర్‌ జక్కుల వెంకటయ్య

గద్వాలటౌన్‌, జూలై 20(ఆంధ్రజ్యోతి): స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం పేరుతో దేశంలోని రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈనెల 22న తలపెట్టిన రైతాంగం నిరసనను విజయ వంతం చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) రాష్ట్ర కన్వీనర్‌ జక్కుల వెంకటయ్య అన్నారు. సోమవారం పట్టణంలోని సీపీఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయం లో ఎస్కేఎం ఆధ్వర్యంలో రైతు సంఘాల రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సమావే శంలో మాట్లాడిన జక్కుల వెంకటయ్య, ఎంఎస్‌ స్వామినాథన్‌ సిఫార్సులను అమలు చేసి రైతులకు అండగా నిలవాల్సిన పాలకులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరు దౌర్భా గ్యమన్నారు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం పేరుతో దిగుమతులపై సుంకాలు ఎత్తివేసి ఎగుమతు లపై ఉన్న సుంకాలను తొలగించకుండా తీసు కునే నిర్ణయం రైతులను నట్టేట ముంచుతుంద న్నారు. ఈనెల 25న ఒప్పందంపై భారత్‌, అమెరికా సంతకాలు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో తలపెట్టిన నిరసనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అదే సమయంలో రైతు రుణ విమోచన చట్టం తేవాలని, గిట్టు బాటుధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. 22న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సత్యారెడ్డి, దానయ్య, ఆంజనేయులు, రాజు, అంజి తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 20 , 2026 | 11:08 PM