రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలి
ABN , Publish Date - May 22 , 2026 | 11:09 PM
రైతులు రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ ఎరువులను రైతులు వినియోగించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం.శంకర్, శ్రీరామ్ రైతులకు సూచించారు.
వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ శంకర్, శ్రీరామ్
గట్టు, మే 22 (ఆంధ్రజ్యోతి): రైతులు రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ ఎరువులను రైతులు వినియోగించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం.శంకర్, శ్రీరామ్ రైతులకు సూచించారు. శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా మండల పరిధిలోని ఆరగిద్దలోని రైతువేదికలో రైతుముంగిట్లో శాస్త్రవేత్తల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు శాస్త్రవే త్తలు పలుసూచనలు చేశారు. రసాయనిక ఎరువుల వినియోగం తగ్గిస్తే నేల సారాన్ని కాపాడుకోవచ్చునని అన్నారు. పత్తిలో గులాబీరంగు కాయతొలుచు పురుగు నష్ట లక్షణాలను రైతులకు తెలిపారు. అలాగే పంట మార్పిడితో అధిక దిగుబడులు పొందుతారని అన్నారు. మార్కెట్‌లో గిరాకీ ఉన్న వరి రకాలను పండించడం వలన అధిక దిగుబడితో పాటు ప్రభుత్వ బోనస్‌ను కూడా పొందవచ్చు అని తెలిపారు. విత్తనాల ఎంపికలో నాణ్యమైన విత్తన లక్షణాలను ఎంచుకోవాలన్నారు. విత్తనాలు కొనుగోలు సమయంలో రసీదు తప్పనిసరిగా పొందాలని, నీటి యాజమాన్య పద్ధతులను పాటించడం వలన నీటిని ఆదా చేయవచ్చునని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాలకృష్ణనాయుడు, ఏఈవో తిరుమలేశ్ రైతులు పాల్గొన్నారు.