Share News

రైతులు అధైర్యపడొద్దు

ABN , Publish Date - May 29 , 2026 | 11:28 PM

వర్షాల వల్ల తడిసి న ధాన్యం కొనుగోలు చేయడం జ రుగుతుందని రైతులు అధైర్య పడా ల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు భరో సానిచ్చారు.

రైతులు అధైర్యపడొద్దు
తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న మంత్రి జూపల్లి, కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

- తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం..

- తాలు, తరుగు పేరుతో ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవు

- ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

వీపనగండ్ల/పాన్‌గల్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): వర్షాల వల్ల తడిసి న ధాన్యం కొనుగోలు చేయడం జ రుగుతుందని రైతులు అధైర్య పడా ల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు భరో సానిచ్చారు. శుక్రవారం మంత్రి, క లెక్టర్‌ ఆదర్శ్‌ సురభితో కలిసి వీపన గండ్ల మండల కేంద్రం కేతేపల్లి శి వారులో ఉన్న ఽధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల తడిసి న ధాన్యాన్ని ఆయన నిశితంగా పరి శీలించారు. క్షేత్ర స్థాయిలో ఉన్న రై తులతో నేరుగా మాట్లాడి వారి ఇ బ్బందులను అడిగి తెలుసుకున్నా రు. ప్రధానంగా లారీల కొరత సమ స్య ఉందని రైతులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని ఇ సుక, ఫ్యాక్టరీల కోసం వినియోగించే లారీలన్నంటినీ పట్టుకుని ధాన్యం తరలించడానికే తీసుకురావాలని ఆ దేశించారు. ముందుగానే వీపనగం డ్ల, పాన్‌గల్‌ పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని మిల్లులకు తర లించాలని తడిచిన ధాన్యాన్ని వెంట నే బాయిల్‌ మిల్లులకు తరలించాల ని ఆదేశించారు. వర్షాల వల్ల ధా న్యం తడిసినప్పటికీ రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదని జిల్లా అధికారుల పర్యవేక్షణలో తడిసిన ధాన్యాన్ని సైతం గోదాములకు తర లిస్తున్నామని మంత్రి వెల్లడించారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చా రు. కేతేపల్లి శివారులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి కొనుగోలు ప్రక్రియ ఆలస్యం చేయడంపై నిర్వాహకులపై మండి పడ్డారు. తాలు, తరుగు పేరుతో రై తులను మోసం చేసేందుకు ప్రయ త్నం చేస్తే ఎవరిపైనైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. వీపన గండ్లలో ధాన్యం దించుకోవడానికి అనుకూలంగా ఉన్న గోదాముకు వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ వినో ద్‌కుమార్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గోవర్దన్‌సాగర్‌, జిల్లా పౌరస రఫరాల అధికారి కాశీ విశ్వనాథ్‌, ప్రజాప్రతినిదులు ఉన్నారు.

Updated Date - May 29 , 2026 | 11:29 PM