Share News

రైతులు ఆర్థికంగా ఎదగాలి

ABN , Publish Date - Jan 28 , 2026 | 11:30 PM

రైతు లు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని కేంద్ర వ్యవసాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కృష్ణకాంత్‌దూబే అన్నారు.

రైతులు ఆర్థికంగా ఎదగాలి
మాట్లాడుతున్న కృష్ణకాంత్‌ దూబే

- కేంద్ర వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కృష్ణకాంత్‌ దూబే

గద్వాల న్యూటౌన్‌/ఎర్రవల్లి/ఇటిక్యాల,జనవరి 28(ఆంధ్రజ్యోతి): రైతు లు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని కేంద్ర వ్యవసాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కృష్ణకాంత్‌దూబే అన్నారు. రైతుల ఆర్థికాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన(పీఎండీడీకేవై) పథకం అమలు చేస్తోందని తెలిపారు. పీఎండీడీకేవై పథకానికి జోగుళాంబ గద్వాల జిల్లా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ పథకం అమలుపై బుధవారం గద్వాల కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అఽధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయంతో పాటు ఉద్యాన పంటలు పండించడమే కాకుండా అను బంధరంగాలైన మత్స్య, పాడి పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందు కు పీఎండీడీకేవై పథకం ద్వారా సహకారం అందించాలన్నారు. జిల్లాలో బీచుపల్లి వద్ద అయిల్‌ మిల్లు ఉండటంతో ఆయిల్‌పామ్‌ సాగు చేసేందుకు అవగాహన కల్పించాలని సూచించారు. అనం తరం ఆయన బీచుపల్లి విజయ ఆయిల్‌మిల్లులోని టీజీ ఆయిల్‌ఫెడ్‌ నర్సరి, ఎర్రవల్లి సమీపంలోని ఎస్‌ఎంఆర్‌ వ్యవసాయక్షేత్రంలో పాలడెయిరీ, గొర్రెల పామ్‌, తిమ్మాపురం దగ్గర చేపల చెరువులను పరిశీలించి రైతులతో మాట్లడారు. ఇటిక్యాల మండలంలోని షాబాద, మునుగాల గ్రామాల పరిధిలోని ఆయిల్‌పామ్‌, వేరుశనగ పంటలను పరిశీలించిన అనంతరం ఆయన రైతులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో డీఏవో సక్రియానాయక్‌, సంగీతలక్ష్మి, ఉద్యానవన శాఖ అధికారి అక్బర్‌, పరిశ్రమల మేనేజర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 28 , 2026 | 11:30 PM