Share News

రైతులకు ఇబ్బందిలేకుండా ధాన్యం కొనాలి

ABN , Publish Date - May 05 , 2026 | 11:37 PM

రైతులకు ఇబ్బందులు లేకుండా జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సంబంధిత అధికారులు తగుచర్యలు తీసుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌బాషాషేక్‌ ఆదేశించారు.

రైతులకు ఇబ్బందిలేకుండా ధాన్యం కొనాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌

  • గూగుల్‌ సమావేశంలో కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌

గద్వాలన్యూటౌన్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఇబ్బందులు లేకుండా జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సంబంధిత అధికారులు తగుచర్యలు తీసుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌బాషాషేక్‌ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌ నుంచి నిర్వహించిన గూగుల్‌ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల పనితీరుపై కలెక్టర్‌ సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఇంకా ప్రారంభదశలోనే కొనసాగుతుండటం, పలుకేంద్రాల వద్ద భారీగా ధాన్యం నిల్వలు ఉండటంపై కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం తేమశాతం ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం వే సి కొనుగోలు చేసి, సంబంధిత మిల్లులకు తరలించాలని ఆదేశించారు. రైస్‌మిల్లులకు ధాన్యం పంపడంలో సరైన ప్రణాళిక పాటించాల్సిన అ వసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతీ సెంటర్‌ను సమీప మిల్లులకు మ్యాపింగ్‌ చేసి, మిల్లుల కెపాసిటీ ఆధారంగా మాత్రమే ధాన్యాన్ని పం పించాలన్నారు. గన్నీబ్యాగుల నిర్వహణపై కూ డా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పాత, కొత్త గన్నీలు సమతుల్యంగా వినియోగించాలని, రా బోయే రోల్లో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాకపెరిగే అవకాశమున్నందున ముందస్తు ప్రణాళికతతో గన్నీసంచులను అందుబాటులో ఉంచాల న్నారు. డేటా నమోదు లోపాలపై కలెక్టర్‌ సం బంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెగిటివ్‌ బ్యాలెన్స్‌లు, తప్పు ఎంట్రీలు లేకుండా ప్రతీరోజు కచ్చితమైన డేటాను నమోదు చేయా లని ఆదేశించారు. సంబంధిత ఏపీఎంలు రోజువారీ నివేదికలను సక్రమంగా సమర్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. సమన్వయం మెరుగుపరచడానికి మండల స్థాయిలో వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి, అందులో సంబంధిత శాఖల అధికారులు, సెంటర్‌ ఇన్‌చార్జీలు, మిల్లర్లు, ట్రాన్స్‌పోర్ట్‌ ప్రతినిధులతో ఫోన్‌ నంబర్లను చేర్చాలని సూచించారు. ఏ సమస్య వచ్చినా వెంటనే గ్రూప్‌లో తెలియజేసి పరిష్కరించుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్‌వో స్వామికుమార్‌, డీఆర్డీఏ ఏపీడీ శ్రీనివాస్‌, డీపీఎంలు, ఏపీఎంలు, వ్యవసాయ శాఖ అఽధికారులు ఉన్నారు.

Updated Date - May 05 , 2026 | 11:37 PM