Share News

కిసాన్‌మేళాకు రైతులను సమాయత్తం చేయాలి

ABN , Publish Date - Nov 05 , 2026 | 11:27 PM

వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలో ఈనెల 7నుంచి 9వ తేదీ వరకు నిర్వహిస్తున్న కిసాన్‌మేళాకు తరలివచ్చేలా జిల్లాలోని రైతులను సమాయత్తం చేయాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషాషేక్‌ అధికారులను ఆదేశించారు.

కిసాన్‌మేళాకు రైతులను సమాయత్తం చేయాలి

  • కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌

గద్వాల టౌన్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలో ఈనెల 7నుంచి 9వ తేదీ వరకు నిర్వహిస్తున్న కిసాన్‌మేళాకు తరలివచ్చేలా జిల్లాలోని రైతులను సమాయత్తం చేయాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషాషేక్‌ అధికారులను ఆదేశించారు. మేళాకు హాజరయ్యే రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కలుగుతుందన్నారు. మేళాకు వెళ్లే బస్సుల ఏర్పాటు, రైతులకు కల్పించాల్సిన సౌకర్యాలపై గురువారం క్యాంప్‌ కార్యాలయం నుంచి జిల్లాలోని అన్ని మండలాల అధికారులతో కలెక్టర్‌ వెబ్‌ఎక్స్‌ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈనెల 9న ఉదయం 10గంటలకు అన్నిబస్సులు మండలాలకు చేరుకోవాలన్నారు. 50 బస్సుల్లో వెళ్లే రైతులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. రైతుల సం ఖ్య పెరిగితే అందుకు అనుగుణంగా అదనపు బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతీ బస్సుకు ఒక సమన్వయ అధికారిని నియమించడంతో పాటు అన్నిబస్సులు అత్యవసర వైద్యసాయం అందించేందుకు ప్రథమచికిత్స కిట్లతో వైద్యసిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. బస్సుకు సంబంధించిన అధికారి నెంబర్‌ను ప్రతీ రైతుకు అందజేయాలన్నారు. ప్రతీ బస్సుకు ఒక పోలీసు అధికారి పర్యవేక్షణ ఉంటుందన్నారు. రైతులకు మధ్యాహ్నం, రాత్రి జిల్లాలోని ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో భోజనాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేళాను విజయవంతం చేసేలా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశం లో అదనపు కలెక్టర్లు మధుమోహన్‌, నర్సింగరా వు, డీఎస్పీ మొగులయ్య, డీఏవో వీరప్ప, ఇతర అధికారులు ఉన్నారు.

Updated Date - Nov 05 , 2026 | 11:27 PM