Share News

రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలి

ABN , Publish Date - Aug 05 , 2026 | 11:35 PM

ఎల్‌నినో నేపథ్యంలో రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాల్సిన బా ధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌, జిల్లా ప్రత్యేక అఽధికారి వీపీ.గౌతమ్‌ సూచించారు.

రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలి
మాట్లాడుతున్న జిల్లా ప్రత్యేక అధికారి వీపీ.గౌతమ్‌, కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

- జిల్లా ప్రత్యేక అధికారి వీపీ.గౌతమ్‌

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి) : ఎల్‌నినో నేపథ్యంలో రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాల్సిన బా ధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌, జిల్లా ప్రత్యేక అఽధికారి వీపీ.గౌతమ్‌ సూచించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభితో కలిసి జిల్లా అధికా రులతో ఎల్‌నినో పరిస్థితులు, పం టల మార్పిడి, ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణాల పురోగతి, మిషన్‌ భగీరథ తదితర అంశాలపై సమీక్ష నిర్వ హించారు. జిల్లాలో వేరుశనగ, మి నుములు, కందులు, ఆయిల్‌పామ్‌, కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు కార్యాచరణ రూపొం దించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గుడిసెల్లో నివసించే వారికి ఇళ్ల మంజూరు, రూఫ్‌ రీప్లేస్‌మెంట్‌ వేగవంతంగా అమలు చేయాలన్నారు. ఉద్యానవన శాఖ పని తీరును సమీక్షిస్తూ ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యా న్ని ఏడాదికి 6వేల ఎకరాలకు పెంచాలని అలా గే 7వేల ఎకరాల్లో కూరగాయల సాగు చేప ట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స మావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2026 | 11:35 PM