Share News

పంట కుంటల నిర్మాణానికి రైతులను ప్రోత్సహించాలి

ABN , Publish Date - Aug 07 , 2026 | 11:38 PM

వర్షాలు తక్కువగా కురుస్తున్నందున ఉన్నజలాలను నిల్వ చేసుకునేందుకు రైతులు పంట కుంటలను నిర్మించుకునేలా సంబంధిత అధికారులు ప్రోత్సహించాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌ నర్సింగరావు అన్నారు.

పంట కుంటల నిర్మాణానికి రైతులను ప్రోత్సహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ నర్సింగరావు

  • అదనపు కలెక్టర్‌ నర్సింగరావు

గద్వాల, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): వర్షాలు తక్కువగా కురుస్తున్నందున ఉన్నజలాలను నిల్వ చేసుకునేందుకు రైతులు పంట కుంటలను నిర్మించుకునేలా సంబంధిత అధికారులు ప్రోత్సహించాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌ నర్సింగరావు అన్నారు. వానాకాలంలో పంటల సాగు, స్మార్ట్‌ రేషన్‌కార్డులు, కొత్త పెన్షన్లు తదితర అంశాలపై శుక్రవారం హైదరాబాద్‌ నుంచి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజ య్‌ జాబు సంబంధిత అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో స మీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం స్థానిక ఐడీవోసీ వీసీ హాల్‌లో జిల్లా అధికారుల తో అదనపు కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలోని ప్రాజెక్టుల్లో వరద నీరు వస్తున్నప్పటీకీ రిజర్వా యర్లలో నీటి లభ్యతను ఆధారంగా చేసుకుని నీటిపారుదల శాఖ అధికారులు రైతులు వేయాల్సిన పంటలపై అవగాహన కల్పించాలన్నారు. ఈనెల 15 నుంచి స్మార్ట్‌ రేషన్‌కార్డులు అందజే సేందుకు అన్నిఏర్పాట్లు చేయాలని సూచించా రు. అర్హులైన వారందరికీ కొత్తగా పెన్షన్లు ఇ చ్చేందుకు అవసరమైన ఏర్పాటు చేసుకోవాల న్నారు. సమావేశంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ రాజ్‌ కుమార్‌, డీఆర్‌డీవో ముషాహిదా బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రాజ్‌కుమార్‌, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 07 , 2026 | 11:38 PM