వర్షం కోసం కాడెద్దులతో కదిలిన రైతులు
ABN , Publish Date - Aug 31 , 2026 | 11:25 PM
వర్షా లు సమృద్ధిగా కురవాలని గద్వాల జిల్లాలోని రైతులు ప్రతీరోజు ఆలయాల్లో పూజలు చేస్తు న్నారు.
వీరభద్రుడి ఆలయంలో ప్రత్యేక పూజలు
మానవపాడు, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి) వర్షా లు సమృద్ధిగా కురవాలని గద్వాల జిల్లాలోని రైతులు ప్రతీరోజు ఆలయాల్లో పూజలు చేస్తు న్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపా డు రైతు సంఘం ఆధ్వర్యంలో కర్షకులు సోమ వారం కాడెద్దులతో గ్రామ సమీపంలోని శివాల యం వద్దకు ఊరేగింపుగా వెళ్లారు. అక్కడ వీరభద్రుడికి ప్రత్యేక పూజలు చేసి వరుణదేవుడు కరుణించే విధంగా చూడాలని స్మరించుకున్నారు. వీరభద్రుడికి పూజలు చేస్తే రైతులకు ప్రకృతి సహకరిస్తుందని గ్రామస్థుల నమ్మకమని రైతు సంఘం నాయకులు తెలిపారు.