యూరియా కోసం రైతుల రాస్తారోకో
ABN , Publish Date - Mar 01 , 2026 | 10:29 PM
యూరియా కోసం రైతులు ధ ర్నా చేశారు. యాప్‌లో బుకింగ్ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడు తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.
- యాప్‌లో స్లాట్‌బుక్ కావడం లేదంటూ ఆందోళన
కల్వకుర్తి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి) : యూరియా కోసం రైతులు ధ ర్నా చేశారు. యాప్‌లో బుకింగ్ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడు తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తాలో రైతులు రాస్తారోకో చేశారు. స కాలంలో యూరియా లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశా రు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొంతమంది డీలర్లు రైతుల పేరుతో దళారులతో కలిసి యాప్‌లో యూరియాను బుక్ చేసు కొని అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించా రు. పంట కాలం దాటిపోతున్నదని, యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు. యాప్ లో ఆన్‌లైన్‌లో కాకుండా పాత పద్ధతిలోనే అడిగిన ప్రతీ రైతుకు యూ రియా అందించాలని రైతులు డిమాండ్ చేశారు. రాస్తారోకోతో వాహనా లు నిలిచిపోయారు. విషయం తెలుసుకున్న కల్వకుర్తి సీఐ బి.నాగార్జున సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. జాతీయ రహదా రిపై రాస్తారోకో చేయడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడు తుందని యూరియా కొరత సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలపడంతో రైతులు శాంతించారు.