Share News

పాలక పక్షానికి రైతుల ఉసురు

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:17 PM

ప్రజాపాలన, రైతు రాజ్యం అని చెప్పుకునే కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చే స్తుందని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి దుయ్యబట్టారు.

పాలక పక్షానికి రైతుల ఉసురు
మాట్లాడుతున్న మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి

- పంటలు ఎండిపోతున్నా పట్టించుకోని ప్రభుత్వం

- మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన, రైతు రాజ్యం అని చెప్పుకునే కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చే స్తుందని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి దుయ్యబట్టారు. ఎరువుల కొరత, కరెంటు సరఫరాలో అంతరాయం, పంటలకు మద్దతు ధర లేక అన్నదాతలు అలమటిస్తున్నారని అయినా ప్రభుత్వానికి చీమ కుట్టిన ట్లు కూడా లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యనించారు. శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో అచ్చంపేట, కల్వకుర్తి బ్రాంచ్‌ కెనాళ్ల పరిధిలో హెడ్‌ రెగ్యులేటరీ లేని కారణంగా జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నదని చెప్పారు. అనేక సందర్భాల్లో రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేసినా స్థానిక ప్ర జాప్రతినిధులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రైతు భరోసాకు దిక్కుల లేకుండాపోయిందని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం వెనుక అంతార్యం వేరేలా ఉందని ఆరోపించారు. వ్యవసాయ రంగానికి కరెంటు సరఫరా విషయంలో కూడా అనేక అవాంతరాలు ఉత్పన్నమవుతున్నాయని వీటన్నింటినీ పరి ష్కరించకుండా ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని విమర్శించారు. కల్వ కుర్తి ఎత్తిపోతల పథకం కింద పంటలు ఎండిపోకుండా నీటి సరఫరా చేయించే బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులదేనని, మూడు రోజు ల్లో ఈ అంశాలు పరిష్కరించకుంటే ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుం టానని హెచ్చరించారు. సమావేశంలో అర్థం రవి, కౌన్సిలర్లు పాండు, అర్జునయ్య, జడ్పీటీసీ మాజీ సభ్యుడు బాలగౌడ్‌, బచ్చలకూర లక్ష్మయ్య, సంబు భీమయ్య పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2026 | 11:17 PM