ఎమ్మెల్యే బండ్లను సన్మానించిన రైతులు
ABN , Publish Date - Sep 24 , 2026 | 11:10 PM
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం గద్వాల మండల రైతులు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సత్కరించారు.
గద్వాలన్యూటౌన్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ను ఒప్పించి జూరాల ప్రాజెక్టుకు నీళ్లు విడుదల చేయడానికి కృషి చేసిన జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం గద్వాల మండల రైతులు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమం లో జిల్లా సీనియర్ నాయకులు మహేశ్వర్‌రెడ్డి, మాజీసర్పంచు అశోక్‌రెడ్డి, నాయకులు శ్రీరాము లు రెడ్డి, రామాంజనేయులు, రైతులు ఉన్నారు.