విద్యుదాఘాతంతో రైతు మృతి
ABN , Publish Date - Apr 05 , 2026 | 11:39 PM
మొక్కజొన్న పంటకు నీళ్లు పెట్టడానికి వెళ్లి న రైతు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన సం ఘటన ఆదివారం ఉదయం మండల పరిధిలోని గుండె వాల్యా నాయక్ తండా గ్రామ పంచా యతీలో జరిగింది.
కోడేరు/గోపాల్‌పేట, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): మొక్కజొన్న పంటకు నీళ్లు పెట్టడానికి వెళ్లి న రైతు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన సం ఘటన ఆదివారం ఉదయం మండల పరిధిలోని గుండె వాల్యా నాయక్ తండా గ్రామ పంచా యతీలో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గుండె వాల్యానాయక్ తండా గ్రామానికి చెందిన కట్రావత్ లోకారం (39) ఉదయం తన వ్యవసాయ పొలంలో మొక్కజొన్న పంటకు నీళ్లు పెట్టడానికి వెళ్లి బోరు బావి దగ్గర మోటార్ స్టార్టర్ ఆన్ చేయడానికి వెళ్లగా కింద వైర్ కట్ అవ్వడంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారని తెలి పారు. ఇతని భార్య కట్రావత్ కమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఆయనకు ఇద్దరు పిల్లలు, భార్య ఉన్న ట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని హెడ్‌కానిస్టేబుల్ బి.రాజు తెలిపారు.