ఆలయ ఉద్యోగులకు ఫేస్ రికగ్నేషన్ అమలు
ABN , Publish Date - Aug 02 , 2026 | 11:48 PM
శ్రీజోగుళాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయాల ఉద్యో గులు, అర్చకుల హాజరు రిజిస్టరు విధానంలో మార్పులు జరిగాయి.
ఇక నుంచి ఉద్యోగులు, అర్చకుల హాజరు డిజిటలైజేషన్
అలంపూరుచౌరస్తా, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): శ్రీజోగుళాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయాల ఉద్యో గులు, అర్చకుల హాజరు రిజిస్టరు విధానంలో మార్పులు జరిగాయి. ఇంతకాలం విధులకు హా జరయ్యే ఉద్యోగులు, అర్చకులు రిజిస్టరు పుస్త కంలో సంతకాలు చేసి జీతాలు పొందేవారు. ఇ క నుంచి ఆ విధానాన్ని స్వస్తిపలికారు. ఉన్నతా ధికారుల ఆదేశాల మేరకు డిజిటల్ హాజరు వి ధానాన్ని శనివారం నుంచి అమల్లోకి తెచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. విధులకు హాజ రయ్యే అర్చకులు, ఉద్యోగులు, సిబ్బంది నిర్దేశిం చిన సమయానికి హాజరై, ఫేస్ రికగ్నేషన్ యాప్ ద్వారా, విధులు నిర్వర్తించే ప్రాంతంలో సెల్ఫీ దిగి, అప్‌లోడ్ చేయాలి. పది నిమిషాలలోపు అప్‌లోడ్ చేయకపోతే విధులకు హాజరుకానట్టే. దీనికితో డు బయోమెట్రిక్ విధానాన్ని కూడా అమల్లోకి తెచ్చారు. ఈ విధానం దేవాదాయ శాఖలో ఇది వరకే ఉన్నా జోగుళాంబ ఆలయాల్లో ఇప్పుడే అమలుచేస్తున్నారు.