అదనపు గదులు లేక అవస్థలు
ABN , Publish Date - Feb 18 , 2026 | 11:32 PM
అదనపు గదులు లేక విద్యార్థు లు అవస్థలు పడుతున్నారు. మూత్రశాలలు లేక బాలికలు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు.
- గట్టు ఉన్నత పాఠశాలలో సమస్యల తిష్ఠ
- గదులు లేక ఆరుబయటే చదువులు
- మూత్రశాలలు లేక ఇబ్బంది పడుతున్న బాలికలు
- నిలిచిపోయిన నిర్మాణ పనులు
గట్టు, ఫిబ్రవరి18 (ఆంధ్రజ్యోతి): అదనపు గదులు లేక విద్యార్థు లు అవస్థలు పడుతున్నారు. మూత్రశాలలు లేక బాలికలు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా, గట్టు ఉన్న త పాఠశాల విద్యార్థులు అసౌకర్యాల మధ్యనే చదువు కొనసాగిస్తు న్నారు. ఈ పాఠశాలలో కనీస వసతులు కల్పించక పోవడంతో విద్యార్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
402 మంది విద్యార్థులకు 5 గదులు
గట్టు ఉన్నత పాఠశాలలో తెలుగు, ఇంగ్లిష్ మీడియం మొత్తం 402 మంది విద్యార్థులు ఉన్నారు. గత విద్యాసంవత్సరం నుంచి తరగతి గదుల కొరత వేధిస్తోంది. మొత్తం 10 తరగతి గదులు అవసరం ఉం డగా ఐదు గదులు మాత్రమే ఉండటంతో ఆరుబయటే చదువుకొం టున్నారు. పీడీ సోస్టుకూడా ఖాళీగా ఉన్నది. ఆరు మూత్రశాలల ఉం డాల్సి ఉండగా రెండు మాత్రమే ఉన్నాయి. దీంతో బాలికలు తీవ్ర ఇ బ్బంది పడతున్నారు. పూర్వపు పాఠశాలలో పది తరగతి గదులు ఉండేవి.. కానీ ఆ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో దాన్ని పూర్తిగా తొలగించారు. గత ప్రభుత్వ హయాంలో నూతనంగా 6 గదుల నిర్మాణ పనులు ప్రారంభించారు. బేస్మెట్ లెవెల్ వరకే ని ర్మించి వదలేశారు. రెండు సంవత్సరాలుగా పనులు ముందుకు సాగ డం లేదు. అదేవిధంగా తాగునీటి సమస్యకూడా వేధిస్తోందని విద్యా ర్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
ఉన్నతాధికారులకు వివరించాం
గట్టు ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రధానంగా తర గతి గదుల కొరత ఉన్నది. సరపడా మూత్రశాలలు లేక బాలికలు ఇబ్బంది పడుతున్నారు. అసౌకర్యాల మధ్యనే బోధిస్తున్నాం. ఉన్నతాధికారులు స్పందించాలి.
- నల్లారెడ్డి, జీహెచ్‌ఎం