ఊరి క్షేమం కోసం.. వనవాసం
ABN , Publish Date - Jul 19 , 2026 | 11:20 PM
గ్రామస్థులు ఏడాది పాటు సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సంవృద్ధిగా కురిసి పాడి పంటలు పండాలని ప్రతీ ఏడాది ఆషాడ మాసం ఒక రోజు గ్రామాన్ని వదిలి వ్యవసాయ పొలాల దగ్గర గడపటం ఆనవాయితీగా వస్తోంది.
దేవరకద్ర/భూత్పూర్/మూసాపేట, జూలై 19 (ఆంధ్రజ్యోతి) : గ్రామస్థులు ఏడాది పాటు సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సంవృద్ధిగా కురిసి పాడి పంటలు పండాలని ప్రతీ ఏడాది ఆషాడ మాసం ఒక రోజు గ్రామాన్ని వదిలి వ్యవసాయ పొలాల దగ్గర గడపటం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఆదివారం మండలంలోని హజిలాపూర్ గ్రామస్థులు ఊరేగింపుగా వ్యవసాయ పొలాలకు వెళ్లి, వంటావార్పు చేసుకొని సరదాగా గడిపారు. సర్పంచ్ జ్యోతి మాట్లాడుతూ ఆషాడ మాసంలో ఊరి క్షేమం కోసం ఓరోజు బయటకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోందన్నారు. గ్రామంలోకి ఎవరు రాకుండా ఉండేందుకు కట్టెలతో మంట వేసి రెండు వైపులా గ్రామ సేవకులను కాపలాగా ఉంచారు. మండలంలోని పోతులమడుగులో ఆదివారం వర్భాలు బాగా కురిసి పంటలు పండాలని కోరుతూ గ్రామస్థులంతా ఊరి బయటికి వసవాసం వెళ్లారు. సాయంత్రం సర్పంచు ఆనంద్‌రెడ్డి, మాజీ సర్పంచు హర్యానాయక్, ఉప సర్పంచు వెంకటేష్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఊషన్న సీతకుంట వద్దకు వెళ్లి తెప్ప పూజలు నిర్వహించారు. మూసాపేట మండలం సంకలమద్ది గ్రామస్థులంతా ఇళ్లకు తాళాలు వేసి ఊరు బయటికి వనవాసం వెళ్లారు. సర్పంచు ప్రవీన్‌కుమార్‌రెడ్డి, ఉప సర్పంచు గౌతం మహవీర్, నాయకులు నారాయణ, వెంకటేష్, రవికుమార్, చంద్రయ్యగౌడ్, ఆంజనేయులు, మహేందర్, రాఘవేందర్‌గౌడ్, పరిపూర్ణచారి, నరహరి, తిరుపతయ్య ఉన్నారు.