పోలీసు కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెక్కు
ABN , Publish Date - Nov 06 , 2026 | 11:52 PM
విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసు కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు.
ఎస్పీ శ్రీనివాసరావు
గద్వాల క్రైం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసు కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. 2025 సంవత్సరంలో అనారోగ్యంతో మృతి చెందిన హోమ్‌గార్డు అధి కారి పి.అశోక్‌రెడ్డి భార్యకు శుక్రవారం జిల్లాపోలీస్ కార్యాలయంలో ఎక్స్‌గ్రేషియా ఫండ్స్ కింద రూ.5లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖ విధి నిర్వహణలో మృతి చెందిన సిబ్బంది కుటుంబాల సంక్షేమానికి ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. కుటుంబ సభ్యుల అవ సరాలను దృష్టిలో ఉంచుకొని వారికి అందాల్సిన మిగిలిన ప్రయోజనాలు కూడా త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.