విహారం.. విషాదాంతం
ABN , Publish Date - Apr 13 , 2026 | 11:11 PM
విహారయాత్ర విషాదాంత మైంది. ఉత్సాహంగా గోవాకు వెళ్లిన స్నేహితులు, తిరుగు ప్రయాణంలో గద్వాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
- చెట్టును ఢీకొన్న కారు, ఒకరి దుర్మరణం
- ముగ్గురికి తీవ్ర గాయాలు
- గోవాకు వెళ్లి వస్తుండగా ప్రమాదం
గద్వాల/ పెంట్లవెల్లి, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి) : విహారయాత్ర విషాదాంత మైంది. ఉత్సాహంగా గోవాకు వెళ్లిన స్నేహితులు, తిరుగు ప్రయాణంలో గద్వాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లికి చెందిన నలుగురు యువకులు ఈ నెల 9వ తేదీన గోవా విహారయాత్రకు వెళ్లారు. మూడు రోజుల పాటు అక్కడే ఉండి తిరుగు ప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారు (షిఫ్ట్) సోమవారం తెల్లవారుజామున జోగుళాంబ గద్వాల జిల్లా, గద్వాల మండలంలోని వీరాపురం సమీపంలో అదు పుతప్పి రోడ్డు దిగి చెట్టును ఢీకొన్నది. దీంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జవగా, ఆ వైపు కూర్చున్న ఇంతియాజ్ (26) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కారులోని బెలూన్లు తెరుచుకున్న ప్పటికీ ఫలితం లేకపోయింది. డ్రైవర్ సీటు లో ఉన్న ఇర్ఫాన్, వెనక కూర్చొని ఉన్న హాజీ, ముజాహిద్‌లకు తీవ్ర గాయాలయ్యా యి. స్థానికుల సమాచారం మేరకు పోలీసు లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇర్ఫాన్, ముజాహిద్‌ల పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబా ద్‌కు తరలించారు. హాజీ ఇక్కడే చికిత్స పొందుతున్నాడు. మరో గంట ప్రయాణం సాఫీగా సాగి ఉంటే నలుగురూ క్షేమంగా పెంట్లవెల్లికి చేరుకొనేవారు. సంఘటనపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న ట్లు పోలీసులు తెలిపారు.