Share News

ప్రతీ కార్యకర్త క్రియాశీలకంగా పని చేయాలి

ABN , Publish Date - Jul 12 , 2026 | 11:47 PM

ఎస్‌ఐ ఆర్‌ పూర్తయ్యే వరకు ప్రతీ కార్యకర్త ప్రతీ గల్లీ లో క్రియాశీలకంగా పని చేసి అర్హుల ఓట్లను సురక్షితం చేయాలని బీజేపీ రాష్ట్ర సీనియర్‌ నేత రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగూ రావు నామాజీ కోరారు.

  ప్రతీ కార్యకర్త క్రియాశీలకంగా పని చేయాలి
బీజేపీ మండల కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న నాగూరావు నామాజీ

- బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సభ్యుడు నాగూరావు నామాజీ

దామరగిద్ద, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఐ ఆర్‌ పూర్తయ్యే వరకు ప్రతీ కార్యకర్త ప్రతీ గల్లీ లో క్రియాశీలకంగా పని చేసి అర్హుల ఓట్లను సురక్షితం చేయాలని బీజేపీ రాష్ట్ర సీనియర్‌ నేత రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగూ రావు నామాజీ కోరారు. ఆదివారం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు సంజీవగౌ డ్‌ అధ్యక్షతన జరిగిన మండల కార్యవర్గ సమా వేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జూలై 25వ తేదీ వరకు పల్లెల్లో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్‌ లిస్టు ప్రక్షాళన కార్యక్ర మంలో ప్రతీ కార్యకర్త పాల్గొనాలని కోరారు. రా ష్ట్ర కార్యవర్గ సభ్యుడు రతంగ్‌ పాండురెడ్డి మా ట్లాడుతూ ప్రతీ కార్య కర్త ఎస్‌ఐఆర్‌లో పా ల్గొంటూనే బూత్‌ స్థా యి నుంచి ఉద్యమాల ను నిర్మించాలని, పార్టీ భవిష్యత్తు ఉద్యమాలపై ఆధారపడి ఉందన్నారు. రాబోయే ఎంపీటీసీ, జ డ్పీటీసీ ఎన్నికల్లో అత్య ధిక సీట్లు కైవసం చే సుకోవాలని, అందుకు గాను కార్యకర్తలు సిద్ధం కావాలని కోరారు. ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడాలన్నా రు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయానికి కృషి చేయాలని అన్నారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపా ధ్యక్షుడు రఘురామయ్యగౌడ్‌, జిల్లా ప్రధాన కా ర్యదర్శి లక్ష్మి శ్యాంసుందర్‌గౌడ్‌, రఘువీర్‌యాద వ్‌, తిరుపతిరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు సం జీవ్‌గౌడ్‌, అంజయ్యగౌడ్‌, గోపాల్‌రావు, సత్తి స త్యనారాయణ, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2026 | 11:47 PM