ఘనంగా ఏరువాక పౌర్ణమి పూజలు
ABN , Publish Date - Jun 29 , 2026 | 11:20 PM
జోగుళాంబ గద్వాల జిల్లాలో ఏరువాక పౌర్ణమిని సోమవారం రైతులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు.
కేటీదొడి, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లాలో ఏరువాక పౌర్ణమిని సోమవారం రైతులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. కోళ్లను, నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. పలుగ్రామాల్లో రైతులు కాడెద్దులను ప్రత్యేకంగా అలంకరించా రు. పొలాల్లో పూజలు చేశారు. మండల కేంద్రం కేటీదొడ్డితో పాటునందిన్నె, కుచినెర్ల తదితర గ్రామాల్లో సోమవారం ఏరువాక పౌర్ణమి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. రైతులు ఉదయాన్నే పొలం దగ్గర పనిముట్లకు, భూమాతకు పూజలు చేశారు. మహిళలు పిండి వంటలను చేసి పశువులకు నైవేద్యాలుగా సమర్పించారు. గ్రామ దేవతలకు కోడిపుంజులను నైవేద్యంగా సమర్పించారు. ఎద్దులను రంగులతో ప్రత్యేకంగా అలంకరించారు. సాయంత్రం ఎద్దులతో ఏరువాక తాడును తెంపడం, గిరక బండ్ల పోటీలు నిర్వహించి ఎద్దులను ఊరేగించారు.