ఎస్‌ఐఆర్ ప్రక్రియలో.. లోపాలు సరి చేయాల్సిందే
ABN , Publish Date - Oct 26 , 2026 | 11:45 PM
ఎస్‌ఐఆర్ ప్రక్రియలోని లోపాలను సరిచేయాల్సిందేనని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి డిమాండ్ చేశారు.
- ఓటు హక్కును ప్రతీ ఒక్కరు కాపాడుకోవాలి
- పేదోడికి న్యాయం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం
- రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి
నారాయణపేట క్రైం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : ఎస్‌ఐఆర్ ప్రక్రియలోని లోపాలను సరిచేయాల్సిందేనని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎ స్‌ఆర్ గార్డెన్‌లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.ప్రశాంత్‌కుమా ర్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా ఎస్‌ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని కోరారు. తనకు కూడా నోటీసు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఓటు హక్కును కాపాడుకోవడం అంటే రాజ్యాంగాన్ని సంరక్షించుకోవడమే అన్నారు. బ్రిటీష్ పాలన తర్వాత ఎవరూ సాహసం చేయలేనిది, ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా కుల గణన చేపట్టారన్నారు. పేదోడికి న్యాయం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం అవుతుంద న్నారు. రాబోయే ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే ధ్యేయంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలన్నారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.