మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ
ABN , Publish Date - Aug 25 , 2026 | 11:33 PM
మొక్కలు ప్రకృతికి ప్రాణాధారమని, ప్రతీవ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని గద్వాల డీఎస్పీ మొగులయ్య అన్నారు.
గద్వాల డీఎస్పీ మొగులయ్య
జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటిన అధికారులు
ఎర్రవల్లి/ధరూరు, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): మొక్కలు ప్రకృతికి ప్రాణాధారమని, ప్రతీవ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని గద్వాల డీఎస్పీ మొగులయ్య అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం కోదండాపురం పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన వనమహోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. పచ్చదనం పెంపొందించి, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకర వాతావరణం అందించడం ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. ప్రతీ ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అలంపూర్ సీఐ ప్రదీప్‌కుమార్, ఎంపీడీవో మహేశ్, ఎస్‌ఐ తరుణ్‌కుమార్‌రెడ్డి, సర్పంచ్ చిన్ననారాయణ, పంచాయతీ కార్యదర్శులు వెంకటనారాయణ, రాజు, సిబ్బంది పాల్గొన్నారు. కొండేరులో ఎంపీడీవో మహేశ్, ఎంఈవో అమీర్‌పాష, సర్పంచు ఈరన్న పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.
ధరూరు : పర్యావరణం సమతుల్యతో మొక్కల పాత్ర ఎంతో కీలకమని సర్పంచు డీఆర్ విజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం ధరూర్‌లోని స్మృతివనంలో పంచాయతీ సిబ్బందితో కలిసి సర్పంచు మొక్కలు నా టారు. విద్యార్థులు, యువత, ప్రజలు మొక్కలు నాటాలని చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, వార్డుసభ్యులు, గ్రామపెద్దలు, విద్యార్థులు ఉన్నారు.