ఉత్సాహంగా ఫుట్‌బాల్, షటిల్ జట్ల ఎంపికలు
ABN , Publish Date - Oct 04 , 2026 | 11:18 PM
పాఠశాల స్థా యి క్రీడల్లో జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదగాలని ఎస్ జీఎఫ్ సెక్రటరీ వేణుగోపాల్ అన్నారు.
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): పాఠశాల స్థా యి క్రీడల్లో జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదగాలని ఎస్ జీఎఫ్ సెక్రటరీ వేణుగోపాల్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో బుధవారంలో జిల్లా కేం ద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఉమ్మడి జిల్లా అండర్-14, 17 షటిల్ బ్యాడ్మింటన్, బాలుర కళాశాల మైదానంలో అండర్-17 బాలుర టోర్నీ కమ్ సెలక్షన్స్ నిర్వహించారు. ఎంపికలను ఎస్‌జీఎఫ్ సెక్రటరీ, సీఐ వి ష్ణువర్ధన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, క్రీడాకారులకు బంగారు భవిష్య త్తు ఉంటుందన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తుది జట్టుకు ఎంపిక చేస్తామని తెలిపారు. ఉమ్మడి జిల్లా పోటీల్లో క్రీడాకా రులు తమ ప్రతిభను చాటాలన్నారు. గతేడాది జిల్లా క్రీడాకారులు ఎస్ జీఎఫ్ క్రీడల్లో ప్రతిభ చాటి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని గుర్తుచేశారు. ఫుట్‌బాల్ టోర్నీ కమ్ సెలక్షన్స్‌లో మహబూబ్‌నగర్, నా గర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జట్లు తల బడ్డాయి. మహబూబ్‌నగర్ జట్టు విజేతగా నిలువగా, నారాయణపేట జట్టు రన్నర్ నిలిచింది. కార్యక్రమంలో నారాయణపేట టీఎస్ అధ్యక్షు డు జగన్‌మోహన్‌గౌడ్, ఫుట్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ భానుకిరణ్, వ్యాయామ ఉపాధ్యాయులు గజానంద్, శ్రీనివాసులు, రామ్‌కళ్యాణ్, రా మ్మోహన్, షటిల్ బ్యాడ్మింటన్ సెక్రటరీ రవికుమార్, సాదత్‌ఖాన్, ఫు ట్‌బాల్ కోచ్ నికేశ్ తదితరులు పాల్గొన్నారు.