Share News

అలరించిన ముగ్గుల పోటీలు

ABN , Publish Date - Jan 14 , 2026 | 11:34 PM

మండలంలోని మద్ధిగట్ల గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు అలరించాయి.

 అలరించిన ముగ్గుల పోటీలు
బహుమతులు అందుకుటున్న మహిళలు

భూత్పూర్‌, జనవరి 14 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని మద్ధిగట్ల గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు అలరించాయి. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ముగ్గులు వేశారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కేసీరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రథమ బహుమతి రజిత, ద్వితీయ, తృతీయ బహుమతి పుష్ప, హర్షిత గెలుపొందగా సర్పంచ్‌ సురేష్‌ బహుమతులు అందజేశారు. మండలంలోని తాటిపర్తిలో సర్పంచ్‌ హబీబా బహుమతులు అందించారు. అదే విధంగా గ్రామంలో ఉన్న యువకులు లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంటు నిర్వహించగా, ముగింపునకు కేసీరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి అభినందించారు. ఉప సర్పంచు రవీందర్‌రెడ్డి, మాజీ ఉప సర్పంచు నర్సింహారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, రాంరెడ్డి, నారాయణరెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు తమ్మన్నగౌడ్‌ పాల్గొన్నారు.

చిన్నచింతకుంట : మండల కేంద్రంలో సంతూర్‌ కంపెనీ వారు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించగా, ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పల్లవి, మమత, పద్మ గెలుపొందగా, మరో 10 మందికి కన్సలేషన్‌ బహుమతులు, పాల్గొన్న ప్రతీ ఒక్కరికి బహుమతులు అందజేశారు. సర్పంచు మానస, ఉప సర్పంచ్‌ భూలక్ష్మి పాల్గొన్నారు.

మిడ్జిల్‌ : మండలంలోని కొత్తూరు, అయ్యవారిపల్లి గ్రామాల్లో ముగ్గులు, పతంగుల పోటీలు నిర్వహించారు. కొత్తూరులో కల్వకుర్తి బీఎంసీ, శ్రీజ డెయిరీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, పతంగి పోటీల్లో గెలుపొందిన వారికి ఆయా గ్రామాల సర్పంచులు రాములు, వెంకట్రాములు బహుమతులు అందజేశారు. యుగంధర్‌రెడ్డి, పాలమిత్ర గంగాధర్‌, మహేష్‌ పాల్గొన్నారు.

మహమ్మదాబాద్‌ : మహమ్మదాబాద్‌ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించగా, సర్పంచ్‌ రాంలాల్‌ ప్రతిభ కనబర్చిన మహిళలకు నగదు బహుమతులు అందజేశారు. ఉప సర్పంచ్‌ పవన్‌, వార్డు సభ్యులు కేశవులు, రహీం పాల్గొన్నారు .

Updated Date - Jan 14 , 2026 | 11:34 PM