Share News

గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూసుకోవాలి

ABN , Publish Date - Apr 29 , 2026 | 11:58 PM

కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూ సుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాఽ ద్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు.

గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూసుకోవాలి
వెంకటాపూర్‌లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న చిన్నారెడ్డి

- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి

వనపర్తి రూరల్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూ సుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాఽ ద్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. బుధవారం మండ లంలోని వెంకటాపురం గ్రామంలో ధాన్యం కొను గోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48గంటల్లోనే డబ్బులు వారి ఖాతాల్లో నేరుగా పడుతాయని అన్నారు. గ్రేడ్‌ -ఏ రకం (సన్నాలు) క్వింటాల్‌కు రూ.2,389, సాధారణ రకం క్వింటాల్‌కు రూ.2,350మద్దతు ధర ఇస్తామని, సన్నరకం ధాన్యం క్వింటాల్‌కు రూ.500బోనస్‌ ప్రభుత్వం ఇస్తుందన్నారు. గన్నీ బ్యాగులు కొరత లేకుండా చూసుకోవాలని ని ర్వాహకులకు సూచించారు. రైతుల ధాన్యాన్ని ద ళారులకు అమ్ముకోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మాలని సూచించారు. రైతు పండించిన ప్రతీ గింజను చివరి వరకు ప్రజా ప్రభుత్వం కొంటుందన్నారు. కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్‌యాదవ్‌, రామేశ్వర్‌రెడ్డి, సర్పం చ్‌ పృథ్వీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2026 | 11:58 PM