జాడలేని వర్షం
ABN , Publish Date - Jul 15 , 2026 | 11:30 PM
ఈ ఏడాది వరుణదేవుడు కరుణ చూ పడం లేదు.
- రైతులపై పగబట్టిన ప్రకృతి
- ఎండుముఖం పడుతున్న పైర్లు
- నిత్యం వర్షం కోసం మేఘాలవైపు చూస్తున్న కర్షకులు
- జిలాలో ్ల2,65,671 ఎకరాల్లో ఆరుతడి పంటలు
- అధికంగా 2,16,038 ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు
- లక్షల్లో పెట్టుబడి, ఆందోళనలో రైతులు
పెద్దకొత్తపల్లి/అచ్చంపేట, జూలై 15 (ఆంధ్ర జ్యోతి): ఈ ఏడాది వరుణదేవుడు కరుణ చూ పడం లేదు. వర్షాకాలం ప్రారంభంలో ఓ మోస్త రు వర్షాలు కురిసినా పక్షంరోజుల నుంచి వరు ణుడి జాడ కనిపించకపోవడంతో రైతన్నలు సాగు చేసిన ఆరుతడి పంటలైన జొన్న, మొక్క జొన్న, కంది, తదితర పంటలు ఎండుముఖం పట్టాయి. దీంతో రైతన్నలు నిత్యం ఆకాశం వైపు ఎదురు చూస్తున్నా జాలి లేని మేఘం కరుణ చూపడం లేదు.
జిల్లాలో 2,65,671 ఎకరాల్లో ఆరుతడి పంటలు
నాగర్‌కర్నూల్ జిల్లాలోని 20 మండలాల్లో ఇప్పటి వరకు ఆరుతడి పంటలైన పత్తి, కంది, మొక్కజొన్న, వేరుశనగ, జొన్న తదితర పంటలు 2,65,671 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారు. అందులో అధిక మొత్తంలో పత్తి పంట 2,16,038 ఎకరాల విస్తీర్ణంలో సాగుచేసినట్లు అధికారుల ద్వారా తెలిసింది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలను సాగుచేస్తే వర్షాలు కురవక పంటలు ఎండుముఖం పట్టాయి. దీంతో రైతులు చేసేది లేక నిత్యం వర్షం కోసం ఆకాశం వైపు చూస్తున్నారు. జాలిలేని మేఘాలు కరుణించడం లేదు. చంటిపిల్లలను కాపాడుకున్నట్లు రైతులు పంటలను చూసుకుంటారు. కానీ ఎండుముఖం పట్టిన పంటను కాపాడుకునేందుకు ఏం చేయా లో తోచక వరుణదేవుడు కరుణించాలని దేవా లయాల్లో పూజలు చేస్తున్నారు. శివాలయాల్లో అభిషేకాలు చేస్తున్నారు. అయినా వర్షం జాడ కనిపిం చడం లేదు.
వేసవిని తలపిస్తున్న ఎండలు..
వర్షాకాలం ప్రారంభమై నెలగడిచినా మండు వేసవిని తలపిస్తోంది. పచ్చగా కళకళలాడాల్సిన పైర్లువాడువట్టి నేలకొరు గుతున్నాయి. పంటలను రక్షించుకునేం దుకు రైతులు నానా తంటాలు పడుతు న్నారు. బోరుబావులున్న రైతులు స్పింక్లర్ల ద్వారా నీరు పెడుతున్నారు. పరిస్థితి ఇలా గే ఉంటే భూగర్భ జలాలు కూడా అడు గంటుతాయని ఆందోళన చెందుతున్నారు.