Share News

ప్రజాబాటలో విద్యుత్‌ అధికారులు

ABN , Publish Date - Oct 06 , 2026 | 11:27 PM

నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో మంగళవారం ఉదయం విద్యుత్‌ శాఖ అధికారులు ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు.

ప్రజాబాటలో విద్యుత్‌ అధికారులు
కోటకొండ గ్రామంలో ప్రజాబాట చేపట్టిన విద్యుత్‌ అధికారులు

నారాయణపేట, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో మంగళవారం ఉదయం విద్యుత్‌ శాఖ అధికారులు ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని విద్యుత్‌ స్తంభాలపై ఉన్న లూజ్‌ లైన్‌లను గు ర్తించారు. అలాగే డ్యామెజ్‌ స్తంభాలను గుర్తించారు. విద్యుత్‌ లైన్‌ కండక్టర్‌ ఎక్కడైతే లూజ్‌ ఉందో అలాంటి ప్రాం తాలను గుర్తించి వాటి స్థానంలో నూ తన కండక్టర్‌ను ఏర్పాటు చేయాలని ఎస్‌ఈ నవీన్‌కుమార్‌, ఏఈ సాయినాథ్‌రెడ్డిని ఆదేశిం చారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యుత్‌ ని యంత్రికను పాఠశాల ప్రహారీ నుంచి బయట అమర్చాలని సూచించారు. సర్పంచ్‌ వెంకట య్య, ఉప సర్పంచ్‌ చెన్నప్ప, ఎల్‌ఐ రవీంద్ర చారి, దేవన్న, విద్యుత్‌ కాంట్రాక్టర్‌ మైనొద్దీన్‌, రా జు, ఆర్టిజన్‌ మహేశ్వర్‌ తదితరులున్నారు.

Updated Date - Oct 06 , 2026 | 11:27 PM