Share News

విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Oct 10 , 2026 | 11:35 PM

విద్యుత్‌ కోతలతో నిరంతరం రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వేసిన పంటలు ఎండుతున్నాయని బీజేపీ మండల నాయకులు, రైతులు మహబూబ్‌నగర్‌ - తాండూరు ప్రధాన రహదారిపై శనివారం అరగంట పాటు రాస్తారోకో చేశారు.

విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాలి
జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులు

మహమ్మదాబాద్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) : విద్యుత్‌ కోతలతో నిరంతరం రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వేసిన పంటలు ఎండుతున్నాయని బీజేపీ మండల నాయకులు, రైతులు మహబూబ్‌నగర్‌ - తాండూరు ప్రధాన రహదారిపై శనివారం అరగంట పాటు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా కిలో మీరు మేర వాహనాలు నిలిచిపోయాయి. బీజేపీ మండల అధ్యక్షుడు మూస నరసింహ, జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు కుర్వ కృష్ణ మాట్లాడుతూ వ్యవసాయానికి నిర్ణయించిన సమయానికి నిరంతరం విద్యుత్‌ అందించాలని డిమాండ్‌ చేశారు. నాణ్యమైన విద్యుత్‌ అందించి, లో వోల్టేజీ సమస్య శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. నాయకులు తిరుపతిరెడ్డి, గుండ్ల శ్రీనివాస్‌రావు, మండల ప్రఽధాన కార్యదర్శి మఠం పవన్‌కుమార్‌, ఉపాధ్యక్షుడు జయవర్ధన్‌రెడ్డి, ఆంజనేయులు, ముచ్చర్ల సురేష్‌, కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు పెంటయ్య, శ్రీనివాసులు, తిరుమలేష్‌, రాహుల్‌నాయక్‌, గోపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2026 | 11:35 PM