Share News

ఆర్టీసీలో ఎన్నికల సైరన్‌

ABN , Publish Date - Oct 04 , 2026 | 11:13 PM

ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు పదేళ్ల తర్వాత జరుగు తుండడంతో నారాయణపేట ఆర్టీసీ డిపోలో ఎ న్నికల ప్రచారంతో వేడెక్కింది.

ఆర్టీసీలో ఎన్నికల సైరన్‌
పేట ఆర్టీసీ డిపో

- ఊపందుకున్న ప్రచారం

- ఒక్కో కార్మికుడికి రెండు ఓట్లు..రెండు బ్యాలెట్లు

- ఒక ఓటు రాష్ట్రస్థాయి గుర్తింపునకు, మరో ఓటు రీజియన్‌ స్థాయికి

- పేట ఆర్టీసీ డిపోలో 290 ఓట్లు

నారాయణపేట, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు పదేళ్ల తర్వాత జరుగు తుండడంతో నారాయణపేట ఆర్టీసీ డిపోలో ఎ న్నికల ప్రచారంతో వేడెక్కింది. 2016లో జరిగిన ఎన్నికల్లో నారాయణపేట డిపో తెలంగాణ మ జ్దూర్‌ యూనియన్‌ (టీఎంయూ) గెలుపొందిం ది. అయితే రెండేళ్లకోమారు జరిగే గుర్తింపు ఎ న్నికలు 2018లో జరగాల్సి ఉండగా అప్పటి ప్ర భుత్వం వాయిదాల మీద వాయిదాలు వేసింది. హక్కుల సాధన కోసం 2019లో ఆర్టీసీ కార్మికు లు, అన్ని యూనియన్‌లు ఏకమై 55 రోజుల పాటు మెరుపు సమ్మెకు పూనుకోవడంతో సీరి యస్‌ అయిన ప్రభుత్వం ఏకంగా యూనియన్‌ గుర్తింపులను రద్దు చేసి ఎన్నికలకు బ్రేక్‌ వేసిం ది. తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్టీసీ గుర్తింపు యూనియన్‌ ఎన్నికలకు గ్రీన్‌సీగ్నల్‌ ఇచ్చింది. దాంతో ఈనెల 9వ తేదీన ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రహస్య బ్యాలెట్‌ ద్వారా కార్మికులు తమ ఓటు హక్కును విని యోగించుకోనున్నారు. పేట డిపోలో 286 ఓట్లు కార్మికులవి ఉన్నాయి. ప్రతీ కార్మికుడు రెండు ఓ ట్లు వినియోగించుకోనున్నారు. ఇందులో ఒక ఓ టు రాష్ట్రస్థాయి గుర్తింపునకు(క్లాస్‌-3), మరో ఓ టు రీజియన్‌ గుర్తింపునకు(క్లాస్‌-6) వినియో గించుకుంటారు. మహబూబ్‌నగర్‌ రీజియన్‌లో 10 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి.

ఎన్నికల్లో పొత్తుల పరంపర

తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ (టీడబ్ల్యూ యూ), స్టాఫ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూ ఎఫ్‌) పొత్తులతో ఈ ఎన్నికల్లో తలపడుతోంది. మరో యూనియన్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (ఈయూ), నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ (ఎన్‌ఎంయూ), తెలంగాణ మజ్దూర్‌ యూని యన్‌ (టీఎంయూ) మూడు కలిసి పొత్తులతో బరిలో ఉన్నాయి. మరొకటి తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ (టీజేఎంయూ) బరిలో ఉంది. భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ (బీఎంఎస్‌) ఇలా మొత్తం 9 యూనియన్‌లు ఎన్నికల బరి లో ఉన్నాయి.

పేట డిపోలో ఎన్నికలు ఉత్కంఠం

నారాయణపేట ఆర్టీసీ డిపోలో తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ (టీడబ్ల్యూయూ), స్టాఫ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) ఐక్యకూట మి, తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ (టీజేఎంయూ), ఎంప్లాయిస్‌ యూనియన్‌ (ఈ యూ), నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ (ఎం ఎంయూ)లు బరిలో ఉన్నాయి. అయితే ప్రస్తు తానికి టీడబ్ల్యూయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఐక్యకూట మి ప్రచారంలో ముందంజలో ఉండి వ్యూహాత్మ కంగా కార్మికుల ఓట్లకు గాలం వేస్తున్నారు. ఇ ప్పటికే కాంగ్రెస్‌ పార్టీ నారాయణపేట నియోజక వర్గ ఇన్‌చార్జి కుంభం శివకుమార్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, రిటైర్డ్‌ ఉద్యోగుల అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు, టీడబ్ల్యూయూ ముఖ్య సలహాదారుడు వడ్ల నాగేందర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే ఈయూ, టీఎం యూ, ఎన్‌ఎంయూ ఐక్యకూటమి తరపున రాష్ట్ర నేత తామస్‌రెడ్డి పేట డిపోలో ప్రచారం ని ర్వహించి, కార్మికుల మద్దతు కూడగట్టుకుంటు న్నారు. ఎవరికి వారు వ్యూహాత్మకంగా కార్మికుల ఓటు బ్యాంకును పెంచుకునేందుకు యత్నిస్తు న్నారు. దాంతో ఆర్టీసీలో ఎన్నికల వేడి రాజు కుంది.

Updated Date - Oct 04 , 2026 | 11:13 PM