Share News

సింగోటం బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Jan 09 , 2026 | 11:36 PM

సింగోటం లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్స వాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల గకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అ ధి కారులను ఆదేశించారు.

 సింగోటం బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, చిత్రంలో కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌, సర్పంచ్‌ ఆదిరాల యాదన్న గౌడ్‌

- ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి

- అధికారులను ఆదేశించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

- సింగోటం లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలపై సమీక్ష

కొల్లాపూర్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): సింగోటం లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్స వాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల గకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అ ధి కారులను ఆదేశించారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో కొల్లాపూర్‌ మండల పరిధిలోని సింగోటం లక్ష్మీ నరసింహ స్వామి బ్ర హ్మోత్సవాలపై శుక్రవారం ఆల య ప్రాంగణంలో నిర్వహిం చిన సమీక్ష సమావేశానికి హా జరైన మంత్రి కలెక్టర్‌ బదా వత్‌ సంతోష్‌, ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌లకు ఆలయ ప్రధాన అర్చకుడు సంపత్‌ కు మార్‌శర్మ పూర్ణకుంభంతో వా రికి ఘనంగా స్వాగతం పలి కారు. వారు లక్ష్మీ నరసింహ స్వామిని ద ర్శిం చుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగ ణం లో నిర్వహించిన సమీక్షలో వారితో పాటు స ర్పంచ్‌ ఆదిరాల యాదన్నగౌడ్‌, ఆలయ ఫౌండర్‌ ట్రస్టీ చైర్మన్‌ ఎస్వీకే కేబీ ఆదిత్య లక్ష్మ ణరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నా రు. మంత్రి మాట్లాడుతూ... ఈనెల 15 నుంచి 21వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తు న్నట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, క ర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బం దుల్లేకుండా చూడాలన్నారు. ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌ బం దోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆ దేశించారు. జాతరలో తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్‌, వైద్యం వంటి ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అ నంతరం మంత్రి ఆలయ ఆదాయం ఖర్చులపై సమీక్షించారు. కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ మా ట్లాడుతూ... సింగోటం జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో పకడ్బందీగా నిర్వహించేందుకు అధి కారులంతా సమన్వయంతో పని చేయాలని ఆ దేశించారు. ఆలయం వద్ద వైద్య సిబ్బంది ఎ ల్లప్పుడు అందుబాటులో ఉండాలని జాతరలో భక్తులకు నీటి సౌకర్యం ఉండేలా ఆయా చోట్ల తాగునీటి వసతి కల్పించాలని తాగునీటి ఇ బ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. కొల్లాపూ ర్‌ ఆర్డీవో భన్సీలాల్‌, డీఎస్పీ శ్రీనివాసులు, ఈ వో రంగారావు, సింగోటం గ్రామ సర్పంచ్‌ ఆది రాల యాదన్న గౌడ్‌, ఉప సర్పంచ్‌ తమటం సాయికృష్ణ గౌడ్‌, శ్రీరాములు, ఉమా శంకర్‌, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

సమీక్షలో రసాభాస

బ్రహ్మోత్సవాల సమీక్ష సమావేశం రసాభాసగా కొన సాగింది. సమీక్ష సందర్భంగా సింగోటం సింగిల్‌విండో మాజీ చైర్మన్‌ చింత కుంట శ్రీనివాస్‌ మాట్లాడుతూ... గడిచిన ప్రభు త్వం హయాంలో ఆలయ అభివృద్ధికి కేసీఆర్‌ రూ.15 కోట్లు మంజూరు చేశారని, ఆ నిధుల ను ఎందుకు రద్దు చేశారో చెప్పాలని మంత్రి జూపల్లిని అడిగారు. దీంతో మంత్రి జూపల్లి మాట్లాడుతూ... గడిచిన ఎన్నికల ముందు హ డావిడిగా ఓట్ల కోసం ఆర్థిక శాఖ అనుమతి లే ని రూ.2500 కోట్లు నిధులను విడుదల చేస్తూ ప్రకటనలు చేసుకున్నారని, వాటిని రద్దు చే స్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అందులో భాగంగానే సింగోటం నిధులు కూ డా రద్దు అయ్యాయని స్పష్టం చేశారు. కాగా, బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు గ్రామ ఉప సర్పంచ్‌ తమటం సాయికృష్ణ గౌడ్‌ సింగోటం శ్రీవారి సముద్రం పరిసరాల్లో అపరి శుభ్రత ఉందని, టూరిజం వారు పర్యాటకుల నుంచి డబ్బులువసూలు చేస్తున్నా వసతులు ఏర్పాటు చేయడం లేదన్నారు. ఆలయ అభివృ ద్ధికి సహకరించాలని బీఆర్‌ ఎస్‌, బీజేపీ నాయ కులు మంత్రిని అడుగుతున్న తరుణంలో ఆ ప్రాంతమంతా ఘర్షణ వాతావరణం నెలకొన్న ది. దీంతో డీఎస్పీ శ్రీనివాస్‌ యాదవ్‌, సీఐ మ హేష్‌ జోక్యం చేసుకుని వివాదం సద్దుమ ణిగించారు.

Updated Date - Jan 09 , 2026 | 11:36 PM