సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు
ABN , Publish Date - Nov 22 , 2026 | 11:36 PM
సీఎం రాకకోసం మద్దిమడులో పకడ్బం దీగా ఏర్పాట్లు చేయాలని ఎంపీ మల్లురవి అ న్నారు.
- 26న మద్దిమడుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాక
- ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ మల్లురవి, కలెక్టర్, ఎమ్మెల్యే
అచ్చంపేట/పదర, నవంబరు 22 (ఆంధ్ర జ్యోతి): సీఎం రాకకోసం మద్దిమడులో పకడ్బం దీగా ఏర్పాట్లు చేయాలని ఎంపీ మల్లురవి అ న్నారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియో జకవర్గంలోని మద్దిమడుగు గ్రామానికి ఈ నెల 26న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్న నేప థ్యంలో ఆదివారం ఎంపీ మల్లురవి, కలెక్టర్ హే మంత కేశవ్ పాటిల్, ఎమ్మెల్యే వంశీకృష్ణలు పరిశీలించారు. మద్దిమడుగులో సంతుసేవాలా ల్ మహారాజ్ విగ్రహా ఏరాటుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం, హెలిప్యాడ్, పార్కింగ్ స్థలా లు, ప్రజల రాకపోకల మార్గాలను ఎంపీ మల్లు రవి పరిశీలించి అధికారులకు సూచనలు చేశా రు. సభకు వచ్చే గిరిజనులకు రవాణా, తాగు నీరు, వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడు తూ సంతు సేవాలాల్ మహారాజ్ విగ్రహా ఏర్పాటుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయ డం గిరిజన సమాజానికి గర్వకారణమన్నారు. కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు పెద్ద సంఖ్యలో రానున్న నేపథ్యంలో అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. అనం తరం ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రా, అదనపు కలెక్టర్లు బి.చెన్నయ్య, దేవసహాయం, డీఎస్పీ పి.శ్రీనివాసు లు, ప్రజాప్రతి నిధులు పాల్గొన్నారు.