Share News

ఎల్‌నినో లెక్క... రైతుకు లాభం పక్కా...

ABN , Publish Date - Nov 27 , 2026 | 11:38 PM

ఇదివరకో లెక్కా.. ఇప్పుడు ఎల్‌నినోదో లెక్కా... శాస్త్రవేత్తల హెచ్చరికలో.. ప్రభుత్వ అధికారుల సూచనలో.. మొండిగా భూతల్లిని నమ్ముకోవడమో... ఏదైతేనేం రైతు ఇంట సిరులు కురుస్తున్నాయి.

ఎల్‌నినో లెక్క... రైతుకు లాభం పక్కా...
కొల్లాపూర్‌ మండలంలో సాగైన మినుముల పంట

  • పంటల దిగుబడి తగ్గినా అన్నదాతకు పెరిగిన రాబడి

  • పల్లి పంటకు పూర్వ వైభవం

  • పెరిగిన వేరుశనగ, మినుముల సాగు విస్తీర్ణం

  • రైతులు అడిగిన ధరకే పంటల కొనుగోళ్లు

  • నాగర్‌కర్నూల్‌ జిల్లాలో లాభసాటిగా ఖరీఫ్‌ సాగు

కొల్లాపూర్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : ఇదివరకో లెక్కా.. ఇప్పుడు ఎల్‌నినోదో లెక్కా... శాస్త్రవేత్తల హెచ్చరికలో.. ప్రభుత్వ అధికారుల సూచనలో.. మొండిగా భూతల్లిని నమ్ముకోవడమో... ఏదైతేనేం రైతు ఇంట సిరులు కురుస్తున్నాయి. ఆయన సాగు చేసిన పంటకే డిమాండ్‌... తెగేసి చెప్పిందే ధర... కోనుగోలు కేంద్రాల్లే వ్‌.. లారీల కోసం ఎదురు చూపుల్లేవ్‌... ఆయన ఇంటికే వచ్చి తేమ ఉన్నా, తాలు కనిపిస్తున్నా పంట కొనుగోలు చేయాల్సిందే.. ఇది ప్రస్తుత కరువు పరిస్థితుల్లో క నిపిస్తున్న తీరు.. నాగర్‌కర్నూలు జిల్లా ఓ మచ్చుతునక నాగర్‌కర్నూల్‌ జి ల్లాలో ఖరీఫ్‌ దిగుబడుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రధాన పంటల దిగుబడి గణనీయంగా తగ్గినప్పటికీ మార్కెట్లో ఏర్పడిన తీవ్ర డిమాండ్‌ జిల్లా రైతులకు కలిసొచ్చిం ది. పల్లి పంటకు తిరిగి పూర్వ వైభవం వచ్చింది. గత ఏడాది కన్నా ఏడాది సాగు విస్తీర్ణం, దిగుబడి గణనీయంగా పెరిగింది. దిగుబడి ఆశించిన స్థాయిలో లేకపోయినా ప్రైవేటు మార్కెట్లో రికార్డు స్థాయి ధరలు పలుకుతుండటంతో రాబడి మాత్రం తగ్గలేదు. వ్యాపారులు, దళారులు నేరుగా రైతుల కల్లాల వద్దకు వెళ్లి పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. రైతులు డిమాండ్‌ చేసిన ధరలకే పంటలను దళారులు కొనుగోలు చేసే పరిస్థితి నెలకొనడం విశేషం. ఎల్‌నినో కారణంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు జిల్లా రై తులు ప్రత్యామ్నాయ, తక్కువ నీటితో పం డే పంటల వైపు మొగ్గు చూపారు. వేరుశన గ, మినుమల సాగు విస్తీర్ణం, దిగుబడి గతేడాది కంటే భారీగా పెరిగాయి. గతేడాది వేరుశనగ పంట జిల్లాలో కేవలం 955 ఎకరాల్లో సాగు కాగా ఈ ఏడాది ఏకంగా 34,303 ఎకరాలకు పెరిగింది. గతేడాది జిల్లాలో 24,709 ఎకరాల్లో మినుముల పంట సాగుకాగా, ఈ ఏడాది 40,811 ఎకరాలకు విస్తరించి దిగుబడి 19,767 టన్నుల నుంచి 24,486 టన్నులకు పెరిగింది.

సాగు, దిగుబడి తగ్గిన సంప్రదాయ పంటలు

ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ప్రధాన వాణిజ్య, ఆహార పంటలైన వరి, మొక్కజొన్న, పత్తి సాగుతో పాటు దిగుబడి గణనీయంగా పడిపోయింది. వరి గతేడాది జిల్లా వ్యాప్తంగా 1,80,745 ఎకరాల్లో సాగు కాగా 4,51,862 టన్నుల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది సాగు 1,61,411 ఎకరాలకు తగ్గగా, దిగుబడి 4,03,527 టన్నులకు పడిపోయింది. మొక్కజొన్న గతేడాది జిల్లా వ్యాప్తంగా 71,982 ఎకరాల్లో సాగు జరగ్గా 2,15,946 టన్నుల దిగుబడి నమోదైంది. ఈసారి 13,877 ఎకరాలకే సాగు పరిమి తమై దిగుబడి 41,631 టన్నులకు తగ్గిం ది. పత్తి 3,09,750 ఎకరాల్లో రైతులు సా గు చేయగా 2,47,800 టన్నుల దిగుబడి వచ్చిం ది. ఈ ఏడాది 2,65,697 ఎకరాలకు సాగు తగ్గగా దిగుబడి 79,709 టన్నులకు పడిపోయింది.

దిగుబడి తగ్గినా పెరిగిన ధరలు

పంటల దిగుబడి తగ్గడం, మార్కెట్‌లో సరుకుకు తీవ్ర కొరత ఏర్పడటంతో గతేడాది మద్ద తు ధరలతో పోలిస్తే ఈ ఏడాది ప్రైవేటు మా ర్కెట్‌లో అన్ని పంట ధరలు భారీగా పెరిగాయి. వరికి గతేడాది మద్దతు ధర రూ. 2300 బోనస్‌ రూ. 500 కలిపి రూ.2800 ఉండగా ఈ ఏడాది ప్రైవేటు మార్కెట్‌లో రూ. 3300 నుంచి రూ. 3800 వరకు పలుకుతోంది. మొక్కజొన్న పంట కు గతేడాది మద్దతు ధర రూ. 2240 కాగా ఈ ఏడాది ప్రైవేటు మార్కెట్‌లో రూ. 3000 నుంచి రూ. 3200 వరకు ధర లభిస్తోంది. పత్తి పంటకు గతేడాది మద్దతు ధర రూ. 7600 ఉండగా, ఈ ఏడాది ప్రైవేటు మార్కెట్‌లో రూ. 10,000 నుంచి రూ. 10,500 వరకు రికార్డు ధర పలుకుతోంది. వేరుశనగ పంటకు గతేడాది ప్రైవేటు మార్కెట్‌లో రూ. 7000 ఉండగా ఈ ఏడాది రూ. 9000 నుంచి రూ. 9500 స్థాయికి చేరింది. మినుముల పంటకు గతేడాది రూ. 7500 ఉన్న ధర, ఈఏడాది ప్రైవేటు మార్కెట్‌లో రూ. 10,000 నుంచి రూ. 10,250 వరకు పలుకుతోంది. మొ త్తంగా ఎల్‌నినో కారణంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా లోని 20 మండలాల్లో పంటల సరళి మారి ప్రధాన పంటల దిగుబడి తగ్గినా ప్రైవేటు మార్కెట్‌లో ఏర్పడిన డిమాండ్‌ రైతులకు వరంగా మారింది.

Updated Date - Nov 27 , 2026 | 11:38 PM