Share News

ఈద్‌కా తోఫా

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:07 PM

రంజాన్‌ పండుగ సందర్భంగా జిల్లాలో మైనారిటీలకు తోఫాలు అందించేందుకు మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఈద్‌కా తోఫా
మహబూబ్‌నగర్‌లోని మైనారిటీ బాలికల గురుకులంలో నిల్వ చేసిర రంజాన్‌ తోఫాలు

జిల్లాకు 4 వేల రంజాన్‌ కానుకలు

అందులో చీర, బ్లౌజ్‌, పంజాబీ డ్రెస్‌, లాల్చీ, పైజామా

మహబూబ్‌నగర్‌ నియోజవర్గానికి 2 వేలు, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాలకు వెయ్యి చొప్పున అందించేందుకు ఏర్పాట్లు

ఇఫ్తార్‌ విందుల కోసం రూ.16లక్షలు మంజూరు

నియోజకవర్గాల వారీగా ఏర్పాటుకు నిర్ణయం

మహబూబ్‌నగర్‌ అర్బన్‌, మార్చి 14(ఆంధ్రజ్యోతి): రంజాన్‌ పండుగ సందర్భంగా జిల్లాలో మైనారిటీలకు తోఫాలు అందించేందుకు మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. అందుకు సంబంధించి 4,000 గిఫ్ట్‌ ప్యాకెట్లు జిల్లాకు చేరాయి. ఒక్కో ప్యాకెట్‌లో చీర, బ్లౌజ్‌, పంజాబీ డ్రెస్‌, లాల్చీ, పై జామా ఉన్నాయి. నియో జకవర్గ కేంద్రాల నోడల్‌ త హసీల్దార్ల ఆధ్వర్యంలో గు ర్తింపు పొందిన మసీదు క మిటీల ద్వారా త్వరలో వీ టిని మండలాల్లో పంపిణీ చేయనున్నారు. మహబూబ్‌నగర్‌ నియోజవర్గానికి 2 వేలు, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాలకు వెయ్యి చొప్పున గిఫ్ట్‌ ప్యాకెట్లు అందించనున్నారు. మైనారిటీ సంక్షేమ, రెవెన్యూ శాఖల సమన్వయంతో తోపాలు పంపిణీ చేయనున్నారు.

ఇఫ్తార్‌ విందు కోసం రూ. 16 లక్షలు

ఇఫ్తార్‌ విందు కోసం మహబూబ్‌నగర్‌ జిల్లాకు రూ. 16 లక్షలు మం జూరు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విందు ఏ ర్పాటు చేయనున్నారు. అందులో రూ.8 లక్షలు మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌, మహబూబ్‌నగర్‌ రూరల్‌, హన్వాడ మండలాల కోసం వెచ్చించనున్నారు. జడ్చర్లకు రూ.4 ల క్షలు, దేవరకద్రకు రూ.4 లక్షలు కేటాయించారు. జడ్చర్లలో గురువారం విందు ఇచ్చారు. ఎమ్మెల్యేల పర్యవేక్షణలో మహబూబ్‌నగర్‌, దేవరకద్రలలో విందు ఏర్పాటు చేయనున్నారు.

త్వరలో పంపిణీ ప్రారంభం..

రంజాన్‌ నెలను పురస్కరించుకుని ఇఫ్తార్‌ విందు కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. జడ్చర్లలలో ఎమ్మెల్యే పర్యవేక్షణలో గురువారం ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశాం. మహబూబ్‌నగర్‌, దేవరకద్రలో ఎమ్మెల్యేల పర్యవేక్షణలో మైనారిటీ సంక్షేమ, రెవెన్యూ శాఖల సమన్వయంతో ఇఫ్తార్‌ విందు ఇవ్వడంతో పాటు కానుకలు పంపిణీ చేస్తాం.

- ఇందిర, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి

Updated Date - Mar 14 , 2026 | 11:07 PM